దేవి.. మెగా హీరో చిత్రం నుండీ తప్పుకోవడానికి కారణం అదే..!

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ ‘దువ్వాడ జగన్నాధం- డీజే’ వంటి మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఇందుకోసమే ‘వాల్మీకి’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. అయితే సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుండీ దేవి తప్పుకున్నాడు. దీనికి సంబందించిన వార్త తెగ వైరలవుతుంది. అసలు దేవి ఈ ప్రాజెక్ట్ నుండీ ఎందుకు తప్పుకున్నాడు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయ్యింది.

అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ హరీష్ ఈ చిత్రంలో ఓ రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేశాడట. కానీ దేవి మాత్రం రీమిక్స్ పాటలను చేయనని తేల్చి చెప్పేశాడట. కానీ హరీష్ మాత్రం ఈ చిత్రంలో రీమిక్స్ ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో చేసేది లేక దేవీ బైటకు వచ్చేసాడట. దీంతో దేవీ స్థానంలో మిక్కీ జే మేయర్ ను తీసుకున్నాడు హరీష్. గతంలో హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రానికి కూడా మిక్కీ జె మేయర్ నే సంగీతం అందించాడు. ఏదేమైనా అసలు హరీష్ ఏ రీమిక్స్ సాంగ్ ను చేయమని దేవి ని ఇబ్బందిపెట్టాడు అనేది మాత్రం తెలియలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus