సాహో డైరెక్టర్ చిరుకు అలా నమ్మకం కలిగించాడు

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ మూవీని నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా రీమేక్ బాధ్యతలు చిరంజీవి యంగ్ డైరెక్టర్ సుజీత్ కి అప్పగించాడు. సుజీత్ తెలుగు నేటివిటీకి మరియు చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ స్క్రిప్టుకి మార్పులు,చేర్పులు చేసే పనిలో ఉన్నాడు. ఐతే టాలీవుడ్ లో ఎంతో మంది డైరెక్టర్స్ చిరుతో చేయడానికి సిద్ధంగా ఉండగా సుజీత్ ని ఎందుకు ఎంచుకున్నాడు అనేది అందరికీ ఆశ్చర్యం కలిగింది.

గతంలో రామ్ చరణ్ తో తమిళ చిత్రం తని ఒరువన్ తెలుగు రిమేక్ ధృవ అద్భుతంగా తీసిన సురేంధర్ రెడ్డి కూడా ఖాళీగానే ఉన్నాడు. ఐనప్పటికీ ఏరి కోరి.. చిరంజీవి సుజీత్ ని ఎందుకు ఎంపిక చేశాడు అన్నదానికి సమాధానం.. సాహో మూవీ సౌత్ ఇండియాలో ఫెయిల్ అయినా, హిందీలో సూపర్ హిట్ అందుకుంది. అలాగే తన రెండో చిత్రం అయినప్పటికీ హీరో ప్రభాస్ ని మరియు భారీ స్టార్ క్యాస్ట్ ని హ్యాండిల్ చేసిన తీరు చిరంజీవికి సుజీత్ సామర్ధ్యం పై నమ్మక పెంచింది అట.

దానికి తోడు 350 కోట్ల బడ్జెట్ మూవీని తెరకెక్కించిన సుజీత్ లూసిఫర్ రీమేక్ అద్భుతంగా తీస్తాడనే నమ్మకం చిరుకు కలిగించడంతో ఈ ప్రాజెక్ట్ సుజీత్ కి అప్పగించాడని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరంజీవి అనంతరం లూసిఫర్ రీమేక్ షూట్ లో జాయిన్ అయ్యే అవకాశం కలదు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus