పవర్ స్టార్ మనసున్నోడు!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ఈ మాట వింటేనే అభిమానులు ఆనందంతో ఊగిపోతారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్, అటు సినిమాల్లోనే కాదు, ఇటు రాజకీయాల్లోనూ సూపర్ సక్సెస్ సాధించాలి అని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే 2019లో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తాను అని అంటున్న పవన్, ఇప్పటికీ ప్రజా సేవలో మునిగి తేలుతున్నాడు…అదే క్రమంలో ఎంతో ఉదార స్వభావం ఉన్న పవన్, ఎవరికి కష్టం వచ్చినా వెంటనే స్పందించి వారికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ వస్తున్నాడు.

ఆ మద్య ఓ టీవి చానల్  తమ వృద్ద ఆశ్రమానికి విరాళం ఇవ్వడమే కాకుండా తనకు ఎంతో గౌరవం ఇచ్చాడని పవన్ చాలా మంచి హృదయం కలవాడని ఓ మహిళ చెప్పింది. అంతే కాదు ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా వెంటనే స్పందిచే పవన్ కళ్యాన్ అందరికంటే ముందుగానే విరాళం ప్రకటించాడు.. ఆంతేకాకుండా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను అని పవన్ చెప్పినప్పటికీ సోషియల్ సర్విస్ లో మాత్రం పవన్ ఎక్కడా వెనకడుగు వెయ్యడంలేదు…ఉదాహరణకి ఈ విషయమే తీస్కుంటే…పవన్ ఎంతటి మనసున్నోడొ ఇట్టే అర్ధం అయిపోతుంది..

తాజాగా పవన్ తనకు ఇష్టమైన జీపు అమ్మారని వార్తలు వచ్చాయి…అయితే వాస్తవానికి ఆ జీపు ఎందు అమ్మాడో తెలిస్తే..నిజంగా పవన్ కి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు..ఆ జీపు కొంతమంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించడానికి తనకి ఇష్టమైన కారుని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుని ఆ పిల్లలకు విరాళంగా ఇచ్చారట. అందుకే అంటారు…పవన్ కల్యాణ్ ప్రజల మనిషి అని…ఏది ఏమైనా…పవన్ అన్నా…నీకు హ్యాట్స్ ఆఫ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus