ఆర్ఆర్ఆర్ హీరోలకు జక్కన్న కొంచెం విరామం ఇచ్చినట్లున్నాడుగా..!

  • March 10, 2020 / 07:39 PM IST

రాజమౌళి ఈ సారి చెప్పిన సమయానికి విడుదల చేయాలని ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిరవధికంగా నిర్వహిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలతో చేస్తున్న మల్టీ స్టారర్ కావడంతో పాటు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజుకు సంబంధించిన ఫిక్షనల్ స్టోరీ కావడంతో మూవీ నిడివి ఎక్కువగా ఉంటుందట. అలాగే చిత్రీకరణ భాగం సైతం చాల ఎక్కువగా ఉండే అవకాశం కలదు. ఇక ఈ చిత్రంలో 8-10 పాటలకు వరకు ఉంటాయట. కాబట్టి రాజమౌళి చిత్ర షూటింగ్ విరామం లేకుండా చిత్రీకరిస్తున్నారు. హెవీ షెడ్యూల్ తో అలసిపోయిన ఆర్ ఆర్ ఆర్ హీరోలకు జక్కన్న హోళీ హాలిడే ఇచ్చినట్లు అనిపిస్తుంది.

ఎన్టీఆర్ నేడు ఫ్యామిలీ తో హోళీ జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే ట్విట్టర్ వేదికగా తన ఫ్యాన్స్ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఐతే హోళీ సంధర్భంగా జక్కన్న షూటింగ్ విరామం ప్రకటించి వీరికి సెలవు ఇచ్చాడా లేక..నెక్స్ట్ షెడ్యూల్ గ్యాప్ రావడం వలన వీరికి కొంత సమయం దొరికిందా అనేది తెలియాలి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో మొదలైన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిరవధికంగా సాగుతుందని సమాచారం ఉంది. ఈ షెడ్యూల్ నందు హీరోయిన్ అలియా మరియు మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ పాల్గొంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 8, 2021లో విడుదల కానుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus