రకుల్ సన్నబడదానికి రీజన్ ఆదేనా!

  • February 6, 2018 / 07:41 AM IST

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు కానీ.. మరీ చిక్కిపోయినా చూడలేరు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి అలాగే తయారయ్యింది. “స్పైడర్” రిలీజ్ వరకూ బాగానే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్లుంది మరీ బక్కపీసులా తయారయ్యింది. ఆమె కొత్త ఫోటోలు, “అయ్యారి” ప్రమోషన్స్ లో భాగంగా ఆమెను చూస్తున్నవాళ్ళందరూ “ఎందుకిలా అయిపోయింది” అని కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా రకుల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ రకుల్ మరీ పేషంట్ గా చూడలేకున్నారు.

అయితే.. రకుల్ ఇలా సన్నగా అయిపోవడానికి కారణం ఉందట. ప్రస్తుతం “అయ్యారి” ప్రయోషన్స్ లో బిజీగా ఉన్న రకుల్, ఆ తర్వాత నుంచి తమిళ చిత్రం షూటింగ్ కోసం చెన్నై వెళ్లనుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో సాయిపల్లవితోపాటు రకుల్ కూడా కథానాయికగా నటించనుంది. ఆ సినిమాలో ఆమెది ఒక మెంటల్లీ అన్ స్టేబుల్ రోల్ అంట. అందుకే రకుల్ అలా సన్నగా తయారయ్యింది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ నటిగా తనను మరో మెట్టు ఎక్కించే స్థాయి పాత్ర కావడంతో రకుల్ ఈ రేంజ్ లో మేకోవర్ కి రెడీ అయ్యిందని తెలుస్తోంది. చూద్దాం మరి సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో, ఆమె ఏమేరకు ఆకట్టుకొంటుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus