గెడ్డం కోసం షూటింగ్ ఆపేశాడు..!
- September 14, 2017 / 01:35 PM ISTByFilmy Focus
ప్రస్తుతం “రాజా ది గ్రేట్” లాస్ట్ షెడ్యూల్ లో మాంచి బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ నిజానికి “టచ్ చేసి చూడు” అనే సినిమాను ముందుగా ఫినిష్ చేయాల్సి ఉంది. కానీ.. ఆ ప్రొజెక్ట్ స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి కాస్త క్లారిటీ మిస్ అవ్వడంతో కాస్త కథ మీద కాస్త వర్క్ చేయమని రవితేజ అడిగాడట. దాంతో ఆ షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే.. ఆ షూటింగ్ ఆగడానికి స్క్రిప్ట్ వర్క్ పెండింగ్ ఉండడం మాత్రమే కారణం కాదట ఇంకో సిల్లీ రీజన్ కూడా ఉందని సమాచారం.
రవితేజ మొన్నటివరకూ నటించిన సినిమాల్లో కేవలం హెయిస్ స్టయిల్ లో మాత్రమే వేరియేషన్ చూపించిన రవితేజ చాలారోజుల తర్వాత గెడ్డం పెంచి కాస్త సన్నగా కనిపిస్తున్నాడు “రాజా ది గ్రేట్”లో, కానీ.. “టచ్ చేసి చూడు”లో క్లీన్ షేవ్ తో క్లాసీగా కనిపిస్తాడట రవితేజ. అందుకే ఆ సినిమాలో మిగిలిన రెండు షెడ్యూల్స్ ను “రాజా ది గ్రేట్” కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేయమని చెప్పాడట.
ఇకపోతే.. రవితేజ నటించనున్న మరో చిత్రమైన తమిళ సూపర్ హిట్ సినిమా “బోగన్” రీమేక్ కోసం బాడీ పెంచనున్నాడని వినికిడి. పోలీస్ క్యారెక్టర్ అవ్వడంతోపాటు.. కాస్త బొద్దుగా కూడా కనిపించాలి అనే ఉద్దేశ్యంతోనే రవితేజ ఇలా వేరియేషన్స్ చూపిస్తున్నాడట. మరి ఈ వేరియేషన్స్ ఆ ఏమేరకు ఉపయోగపడతాయో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













