అజ్ఞాతవాసిలో కుష్బూ నటించడానికి కారణం ?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి నిన్న రిలీజ్ అయి మంచి కలక్షన్స్ రాబడుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి కుష్బూ నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులకు ఆనందంగా ఉంది. కుష్బూకూడా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపిగా సమాధానం చెప్పారు. ఇంతకాలం గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటించడానికి కారణం ఏంటి? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. “చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నా. తెలుగే కాదు తమిళ సినిమాల్లోనూ నటించలేదు. ఇది నాకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లాంటిది. కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకునేలా నా పాత్ర ఉండాలి. “అజ్ఞాతవాసి”లో నా పాత్ర అలాంటిదే.

త్రివిక్రమ్‌ ఈ పాత్ర గురించి నాకు వివరించినప్పుడు చాలా నచ్చింది. చెప్పాలంటే.. త్రివిక్రమ్‌ గతంలోనూ నాకు చాలా స్క్రిప్ట్‌లు వినిపించారు. కానీ, నాకు అవేవీ నచ్చలేదు. ‘అజ్ఞాతవాసి’లో నా పాత్ర గురించి వివరించే ముందు “మేడం.. ఈ పాత్రకు మాత్రం నో చెప్పకండి” అన్నారు. అంత మంచి పాత్ర నాకు ఇస్తే.. నేను నో ఎందుకు చెప్తాను?” అని వివరించారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడంపై మాట్లాడుతూ.. “పవన్‌ చాలా కూల్‌. తక్కువగా మాట్లాడతారు. ఆయనతో నటించడం సౌకర్యంగా ఉంటుంది. చిత్రబృందం నన్ను కుటుంబంలో ఒకరిగా చూసుకున్నారు” అని చిత్ర యూనిట్ ని అభినందించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags