రాజమౌళి సైలెన్స్ వెనుక అసలు కారణం..!

‘బాహుబలి’ తో టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసాడు రాజమౌళి. బాలీవుడ్ తో పోలిస్తే మన తెలుగు చిత్రం ఏమాత్రం తీసిపోదు అని ‘బాహుబలి’ ని బాలీవుడ్ చిత్రాలని బీటౌట్ చేసేలా తీర్చి దిద్ది ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఇప్పుడు తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటినుండీ రోజుకో వార్త పుట్టుకొస్తుంది.

చరణ్ – ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లని వెతికే పనిలో జక్కన్న ఉన్నాడని… ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితీ చోప్రాను సంప్రదించాడని… అయితే పరిణితీ భారీగా డిమాండ్ చేయడంతో అలియ భట్ ని సంప్రదించాడని గత కొంత కాలం నుండీ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రకోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ని రాజమౌళి కలిసాడని. అయితే అజయ్ దేవ్ గన్ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉండడంతో.. ఈ పాత్ర కోసం మరో బాలీవుడ్ హీరో కోసం వెతుకుతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే … ఈ వార్తల పై ఇప్పటి వరకూ రాజమౌళి స్పందించకపోవడంతో… కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రాజమౌళి ఏ చిత్రాలకి కూడా… ఇంత సైలెన్స్ పాటించలేదు. ఇప్పటి వరకూ చరణ్ – ఎన్టీఆర్ పేర్లు తప్ప మరే ఆర్టిస్ట్ పేరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి గత చిత్రాల… నటీ నటుల్ని ముందుగా ప్రకటించేసి దానికి తగ్గ ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేసేవాడు. అయితే… ఇప్పుడు ఎందుకు ఇంత మౌనం పాటిస్తున్నాడన్నది అర్ధం కానీ ప్రశ్న..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus