Radhe Shyam Movie: ‘రాధే శ్యామ్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో ‘గోపి కృష్ణా మూవీస్’ ‘యూవీ క్రియేషన్స్’ వారి నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రాధే శ్యామ్’.మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు మంచి హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి. ఇదిలా ఉండగా.. ‘రాధే శ్యామ్’ ను కచ్చితంగా చూడడానికి… 10 రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ముందుగా మన ప్రభాస్. ‘బాహుబలి2’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ బెడిసి కొట్టింది. అయినా సరే అతని ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ‘వర్షం’ ‘డార్లింగ్’ ల తర్వాత అతను చేస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ ఇది.ఈ మూవీలో అతను పామిస్ట్ గా కనిపించబోతుండడం మరింత ఆకర్షించే అంశం.

2) ఒక లవ్ స్టోరీకి ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఎందుకు అంశం కూడా ఆకర్షించేదే..!

3) వరుస విజయాలతో ఊపు మీద ఉంది పూజా హెగ్డే. పైగా ప్రభాస్ హైట్ కు సూట్ అయ్యే హీరోయిన్. కాబట్టి ఈ పెయిర్ కూడా ఆకర్షిస్తుంది.

4)భాగ్యశ్రీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తుంది. ఆమెకి సంబంధించిన షాట్స్ ట్రైలర్ వంటి వాటిలో చూపించలేదు. కాబట్టి ఈమె కూడా ఆకర్షించే అంశమే..!

5) ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారు ఈ మూవీలో పరమహంస అనే పాత్రని పోషించారు. ఈయన లుక్ కూడా బాగుంది.

6) మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బిగ్ స్క్రీన్ పై చాలా బాగుంటుంది అనే హోప్ ను క్రియేట్ చేసింది.

7) జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ హిట్ అయ్యాయి. సినిమాలో అవి ఇంకెంత బాగుంటాయో..!

8) మన తమన్ అన్న బి.జి.ఎం మరో ఆకరిషించే అంశం. అయితే ఆయన ఇప్పటివరకు మాస్ సినిమాలకి ఎక్కువగా పనిచేసాడు. ఒక్క ‘మజిలీ’ తప్ప ఇతను ప్రేమ కథా చిత్రాలకి పనిచేసింది తక్కువ. మరి ఈ భారీ బడ్జెట్ లవ్ స్టోరీకి ఏ రేంజ్ బి.జి.ఎం అందించాడో..!

9) జిల్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అందించాడు దర్శకుడు రాధా కృష్ణ. కానీ ‘రాధే శ్యామ్’ ఆయన మొదటి సినిమాకి పూర్తి భిన్నంగా ఉంటుంది అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

10) క్లైమాక్స్ చాలా అద్భుతంగా వచ్చింది అని రాజమౌళి గారు చెప్పారు. ఆయన వాయిస్ తోనే ఈ చిత్రం కథ మొదలవుతుంది, ఎండ్ అవుతుంది. అది కూడా ఆకర్షించే అంశమే..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus