పోలీస్ ఆఫీసర్ గా రెజీనా!

తన అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనాకు కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ ఆమె ఎనర్జీకి సరిపడా రోల్ పడలేదని ఓ ఓపీనియన్ వుంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో కృష్ణ వంశీ చేతిలో పడింది రెజీనా. కృష్ణ వంశీ పాత్రల ప్రత్యేకత గురించి మళ్ళీ చెప్పక్కరలేదు.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘నక్షత్రం’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఆ లుక్ ను బట్టి ఈ సినిమాలో రెజీనా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. రీసెంట్ గా రాశిఖన్నా కూడా పోలీస్ పాత్రలో మెరిసింది. ఆ రోల్ రాశికి మంచి పేరే తెచ్చిపెట్టింది. పోలీస్ అంటే ఎమోషన్స్ పీక్స్ లో వుంటాయి. మరి ఈ ‘నక్షత్రం’ రెజీనాకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus