రేజినా కసాండ్ర….ఈ అందాల భామ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి దాదాపుగా 4ఏళ్లు దాటింది. తొలి సినిమాతో మంచి తారగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్లాక్ బష్టర్ లేదు అంటే నమ్మలేము. కానీ అదే నిజం. ఈ భామకు అవకాశాలు అయితే మెండుగా వచ్చాయి కానీ, పాపం హిట్ సినిమా మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా పడకపోవడంతో చేసేది ఏమీ లేక, అప్పుడప్పుడు అందాల ప్రదర్శనకు అవకాశం ఇస్తుంది. విషయం ఏమిటంటే….
రేజినా కసాండ్ర చిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి సినిమా తరువాత, కాస్త ప్రజాకార్షణ ఉన్న హీరో సాయి ధర్మ తేజ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ చేసింది అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడంతో వెనువెంటనే గోపీచంద్ హీరోగా ‘సౌఖ్యం’ చేసింది. అయితే ఎన్నో ఆశలతో హిట్ అవుతుంది అని అనుకున్న ఆ చిత్రం సైతం పీడకలనే మిగిల్చింది. ఇక అదే క్రమంలో మాస్ ను పక్కన పెట్టి సరికొత్త స్టైలిష్ పాత్రలో మంచు మనోజ్ ‘శౌర్య’తో జతకట్టింది. అయితే ఆ సినిమా కూడా డింకీ కొట్టడంతో చేసేది ఏమీ లేక..అప్పుడప్పుడూ అందాల ప్రదర్శనలు ఇస్తూ తనలోని అందాన్ని, ఆరాటాన్ని, అభిమానులకు, సినీ ప్రేక్షకులకు చూపిస్తుంది. ఇక మరో పక్క నారా రోహిత్ తో శంకర అనే సినిమా చేసిన ఆమె ఆ సినిమా సైతం ఏమయ్యిందో తెలియకపోవడంతో పాపం చేతిలో సినిమాలు ఏమీ లేక ఫ్యాషన్ షోస్ చేసుకుంటుంది. ఇక తెలుగులో ఈగలు తొలుకుంటున్న ఈ అప్సరస, తమిళ్ లో మాత్రం రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి చివరకి ఒచ్చేసింది రెండోది కూడా పూర్తి అయ్యేలోగా మన పెద్ద హీరోలు ఏమైనా కాస్త ఆమెకు అవకాశం కల్పిస్తే సమర్పించుకోవాడానికి రెడీ అయిపోయేలా ఉంది. మరి అసలే డిజాస్టర్ లు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో పెద్ద హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.