అందాల భామ రెజీనా స్పీడ్ తగ్గిందా? గత ఎడాదిలాగా ఆమె దూకుడు చూపించాడంలేదా? అసలు రెజీనాకు ఏమయ్యింది అసలు కధ ఏంటి?? విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో వినిపిస్తున్న వివరాల ప్రకారం…రెజీనాను టాలీవుడ్ పక్కకు పెట్టింది అన్న వాదన బలంగా వినిపిస్తుంది…ఇదే హాట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
గత ఏడాది ఆ అందాల భామ స్పీడ్ చూసిన వారు ఈమె టాప్ హీరోయిన్ గ సెటిల్ అయిపోతుంది అని అనుకున్నారు. వరుసగా హిట్స్ ఇవ్వడమే కాకుండా….‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో ఒక పక్క గ్లామర్ మరో పక్క అభినయంతో ఫుల్ మార్కులు కొట్టేయడంతో ఇక ఆమెకు టాప్ హీరోల పక్కన ఛాన్సులు వస్తాయని విశ్లేషకులు అంచనాలు వేసారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని అనుకోని రూపంలో ‘సౌఖ్యం’ సినిమా ఫెయిల్యూర్ ఆమె కెరీర్ కు పెద్ద షాక్ ఇచ్చి బ్రేక్ వేసింది. ఆ దెబ్బతో రెజీనాకు అవకాశాలు రావడం పూర్తిగా తగ్గి పోయాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తీస్తున్న ‘జో అచ్యుతానంద’ లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో పాటు సెల్వ రాఘవన్ దర్శకత్వం లో ఒక హర్రర్ మూవీ లో నటిస్తుంది.ఈ రెండు సినిమాలు తప్ప రెజీనాకు ఒక్క సినిమా కూడ లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఏ మెగా యంగ్ హీరోలతో అయితే వరుసగా మూడు సినిమాలు చేసిందో, అదే మెగా యంగ్ హీరోలు ప్రస్తుతం ఆమెను పక్కకు పెట్టేస్తున్నారు అన్న వార్తలు సైతం టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
దాదాపుగా 27 ఏళ్ల వయసుగల ఈ అందాల సుందరి…మరో రెండేళ్లు గడిస్తే కెరియర్ ముగిసి పోయే నేపధ్యంలో ఆమెకు ఇలా అవకాశాలు రాకపోవడం వెనుక ఏమైనా రాజకీయాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి. అందం అభినయం రెండూ ఉన్న రెజీనాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం ఆమె దురదృష్టం అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈమె కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తున్న నేపధ్యంలో ఈమె నెమ్మదిగా టాలీవుడ్ కు టాటాచెప్పి కోలీవుడ్ లో సెటిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి తమిళ తంబీలు సైతం చెబుతున్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో.