చిత్ర పరిశ్రమలో గాసీప్స్ సర్వసాధారణం. ఆ హీరో ఈ హీరోయిన్ తో తిరుగుతున్నాడంటా, ఆ హీరోయిన్ ఈ హీరోతో రొమ్యాన్స్ చేసిందంటా. అంతెందుకు పలానా హీరో, ఆ హీరోయిన్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అని రకరకాల గాసీప్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని కేర్ చెయ్యకుండా పోతేనే సెలెబ్రిటీ స్థాయిని అందుకోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటి అంటే…ఎస్.ఎమ్.ఎస్ సినిమా ద్వారా తెలుగు తెరపు పరిచయం అయిన తమిళ బ్యూటీ…రేజినా కసాండ్ర కు దాదాపుగా మూడో సినిమా వరకు బ్రేక్ రాలేదు. మెగా శిబిరం నుంచి వచ్చిన సాయి ధర్మ తేజ పుణ్యమా అంటూ ఆమెకు వరుసగా రెండు హిట్స్ రావడమే కాకుండా స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఒకరకంగా అది ఆమెకు కలసి వచ్చింది. మరో రకంగా ఇబ్బందులు సైతం తెచ్చిపెట్టింది. అదేలా అంటే…సాయి ధర్మ తేజతో కలసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో నటించిన ఈ తమిళ బ్యూటీ, ఆ రెండు సినిమాలు ఇచ్చిన కిక్ తో సాయి కి కాస్త దగ్గరయ్యింది. ఇంకేముంది మన మీడియా మైకులకు పని చెప్పింది. ఆ ఇద్దరి మద్య ఏదో ఉందని ఇద్దరూ మంచి లవ్ లో మునిగిపోయారని రక రకాలు రూమర్లు ఆటొమ్యాటిక్ గా పుట్టుకొచ్చేశాయి. ఆ రూమర్స్ ను వినీ వినీ, విసిగిపోయిన ఆమె…చివరకు బ్లో ఔట్ అయిపోయింది…ఈ పుకార్ల వల్ల తన కరియర్ కు ప్రాబ్లమ్ అవుతుంది అని. పుకార్లు పుట్టించి హీరోయిన్లను వారి కరియర్ లను ఇబ్బందుల్లోకి నెట్టవద్దు అని ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది. మరి ఇప్పటికైనా మన మీడియా వాళ్ళు నోళ్ళు మూసుకుంటారో లేకపోతే మరో రౌండ్ వేసుకుంటారో చూడాలి.