తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన రేణు దేశాయ్.. ఆ తర్వాత అనేక చిత్రాలకు తెరవెనుక పనిచేసి తనలోని రైటర్ కి మెరుగులు దిద్దుకున్నారు. సొంతంగా సినిమాని నిర్మించడమే కాదు.. దర్శకురాలిగా మారారు. రీసెంట్ గా ఓ తెలుగు డాన్స్ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇలా మల్టీ టాలెంటెడ్ లేడీగా రేణు దేశాయ్ నిరూపించుకున్నారు. తాజాగా ఆమెలోని కవియిత్రిని బయటపెట్టారు. “డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్” అనే టైటిల్‌తో కవితను, వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. దీన్ని అభిమానుల కోసం ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో ముక్కలైన హృదయం, రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు మాత్రమే మిగిలాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “కమ్ముకున్న మంచు కరిగిపోయి మళ్ళీ ఆ జ్ఞాపకాలు కళ్ళెదుట నిలిచాయి.
మనసు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలని మళ్ళీ తట్టి లేపుతుంది. తిరిగి చూసుకుంటే..తుప్పు పట్టిన కలం, తుడిచిపెట్టుకుపోయిన పేరు. విధి ఎంత బలీయమైనది . ముక్కలైన హృదయం విషాద సాహత్యం” అంటూ తన కవితను ముగించారు. ఇది ఆమె ప్రస్తుత పరిస్థితికి అద్ధం పట్టింది. విడాకుల అనంతరం ఒంటరితనం తనని ఎంత వేధిస్తుందో ఈ అక్షరాలు కళ్ళకు కడుతున్నాయి. తాను మరో పెళ్లి చేసుకుంటానంటే విమర్శలు గుప్పించిన పవన్ అభిమానులు సైతం ఈ కవితకి కన్నీరు పెడుతున్నారు. రేణు దేశాయ్ ని ప్రతి ఒక్కరూ కరిగిన హృదయంతో అభినందిస్తున్నారు.