ఇప్పటి నుంచే శ్రమిస్తున్న రేణు దేశాయ్

  • November 1, 2016 / 08:04 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో వారసుల ఎంట్రీ అనేది కామన్ అయిపోయింది. హీరోల కుటుంబాలే కాకుండా వారి అభిమానులు సైతం సినీ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది హీరోలుగా నిలదొక్కుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్, మెగా బ్రదర్ నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక సినీ ఎంట్రీ జరిగిపోయింది. మంచి నటులుగా నిరూపించుకుంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడుగా ఎవరు పరిచయం అవుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం మూడో భార్యతో జీవనం కొనసాగిస్తున్నారు.

పవన్ మొదటి మాజీ భార్యకు పిల్లలు లేరు. రెండో మాజీ భార్య రేణు దేశాయ్ కి అకీరా, ఆద్య అని ఇద్దరి పిల్లలు. మూడో భార్యకు కూడా పిల్లలు పుట్టారు. రేణు దేశాయ్ విడాకులు తీసుకొని దూరంగా ఉన్నా తన పిల్లలు మెగా ఫ్యామిలీకి దూరం కాకూడదని భావిస్తోంది. తన పిల్లల భవిష్యత్ కోసం పవన్ తో పరిచయాన్ని కొనసాగిస్తోంది. అకీరాను పవన్ వారసుడిగా పరిచయం చేయడానికి ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులకు అందుబాటులో ఉంది. అకీరా నటించిన తొలి చిత్రానికి ప్రమోషన్ కూడా బాగా చేసింది. ఇప్పుడు కూడా తరచూ పవన్ కళ్యాణ్, పిల్లల ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో  టచ్ లో ఉంటోంది. ఆమె ఆరాటం చూస్తుంటే పిల్లలపై తల్లి ప్రేమ కనిపిస్తోంది. వదిన (రేణు దేశాయ్) భయపడాల్సిన పని లేదని, అకీరానే మా కాబోయే పవర్ స్టార్ అని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus