Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రేణు దేశాయ్ రీల్ అండ్ రియల్ లైఫ్ రహస్యాలు

రేణు దేశాయ్ రీల్ అండ్ రియల్ లైఫ్ రహస్యాలు

  • December 3, 2016 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రేణు దేశాయ్ రీల్ అండ్ రియల్ లైఫ్ రహస్యాలు

బద్రి సినిమాలో “బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే” అని పవన్ కళ్యాణ్ పాడుతుంటే హీరోయిన్ రేణు దేశాయ్ ని కళ్లార్పకుండా చూసారు ప్రేక్షకులు. మొదటి సినిమాతోనే ఆమె సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జానీ చిత్రంలో హోమ్లీగా కనిపించి నటనతో మెప్పించారు. నటిగానే కాకుండా కొణిదెల ఇంటి కోడలుగా రేణు దేశాయ్ మెగా అభిమానులకు చాలా దగ్గరయ్యారు. ఆమె నేడు (డిసెంబర్ 4 ) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె రీల్ అండ్ రియల్ లైఫ్ సీక్రెట్స్ అందిస్తోంది.

1 . మాతృ భాష మరాఠీRenu Desaiమహారాష్ట్రలోని పూణే లో1981 సంవత్సరంలో డిసెంబర్ 4న రేణు దేశాయ్ జన్మించారు. ఆమె మాతృ భాషా మరాఠీ. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా రేణు చదువు అనంతరం మోడలింగ్ వైపు అడుగులు వేశారు.

2 . స్పెషల్ అప్పీరియన్స్ Renu Desaiముంబై లో మోడల్ గా బిజీగా ఉన్న సమయంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ గుక్కతిప్పుకోకుండా పాడిన పాటలో రేణు దేశాయ్ కనిపించారు. ఈ స్పెషల్ అప్పీరియన్స్ ద్వారా సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డారు.

3 . కోలీవుడ్ ఎంట్రీRenu Desaiజేమ్స్ పాండ్ అంటే తమిళ సినిమా ద్వారా రేణు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ చిత్రం విడుదల కాకముందే తెలుగులో బద్రి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు.

4 . బద్రి కలిపిన బంధంRenu Desaiబద్రి సినిమాలో నటిస్తున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రేణు ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు కలవడంతో కొంతకాలం సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నారు.

5 . కాస్ట్యూమ్ డిజైనర్Renu Desaiపవన్ కళ్యాణ్ చిత్రాలకు రేణు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం సినిమాలు సరికొత్త డిజైన్స్ ని పరిచయం చేశారు.

6 . ఇద్దరు పిల్లలుRenu Desaiపవన్ కళ్యాణ్, రేణు దంపతులకు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు. 11 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత 2013 లో పవన్ తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.

7 . నిర్మాతRenu Desaiపవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత సినిమాలకు రేణు మరింత దగ్గరయ్యారు. మాతృభాషలో “మంగళాష్టక్ వన్స్ మోర్ ” అనే రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించారు. సమీర్ జోషి దర్శకత్వంలో వచ్చిన ఈ మరాఠీ మూవీ యువతను ఆకట్టుకుంది.

8 . డైరక్టర్Renu Desaiపవన్ కళ్యాణ్ సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన రేణు దేశాయ్ “ఇష్క్ వాలా లవ్” అనే మరాఠీ మూవీ ద్వారా మెగా ఫోన్ అందుకున్నారు. అకిరా ఫిలిమ్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని ఆమె సొంతంగా నిర్మించారు. ఇందులో పవన్ తనయుడు అకిరా కూడా నటించాడు.

9 . స్నేహితుడుRenu Desaiపవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ రేణు అతనితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోయిన ప్రభావం పిల్లలపై పడకుండా పెంచుతున్నారు. పవన్ ఫ్యాన్స్ ఆమెను ఇప్పటికీ వదినా అని పిలుస్తుంటారు.

10 . ఖుషి 2Renu Desaiపవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఖుషి మూవీ ఒక మైలు రాయి వంటిది. ఈ చిత్రం అంటే రేణు దేశాయ్ కి భలే ఇష్టం. ఖుషి కి సీక్వెల్ తన సొంత బ్యానర్లో తీయాలనేది ఆమె కల. ఈ ఏడాది మొదట్లో దర్శకుడు ఎస్.జె.సూర్య తో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే సెట్ కాలేదు. త్వరలో ఆమె డ్రీమ్ ప్రాజక్ట్ పట్టాలెక్కాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Renu Desai
  • #Annavaram movie
  • #Badri Movie
  • #Balu Movie
  • #gudumba shankar Movie

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version