విడాకుల విషయంలో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!

మనుషులంటే సంఘ జీవులు. మన గురించి మంచి, చెడు మాట్లాడుకోవడానికి ఆ నలుగురు ఉంటారు. మంచి చేస్తే అభినందిస్తారు. చెడు చేస్తే విమర్శిస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలు అయినా ఇవి ఎదుర్కోక తప్పదు. స్టార్స్ అయితే ఈ డోస్ ఎక్కువగా ఉంటుంది. నటి రేణు దేశాయ్ కి ఈ విమర్శల వర్షంలో గత కొంతకాలంగా తడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి ఒంటరిగా బతుకుతున్నంతవరకు వదిన అంటూ  పిలుస్తూ అండగా నిలిచిన అభిమానులే ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంతో ఎదురుతిరిగారు. విమర్శల చేయడం మొదలు పెట్టారు. దీంతో పవన్ ఫ్యాన్స్, రేణు మధ్య పెద్ద మాటల యుద్ధమే సాగుతోంది.  రీసెంట్ గా రేణు స్వప్నతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో “పవనే విడాకులు కావాలని కోరారు” అని వెల్లడించింది.

అన్నాలెజ్‌నెవా గర్భవతి కావడంతో విడాకులు కావాలని పవన్ అడిగినట్లు తెలిపారు. దీనిపై పవన్ ని సమర్థిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు చేస్తున్నారు. పొలెనా పుట్టిన తర్వాతే విడాకులు తీసుకున్నారని రేణుని విమర్శించారు. దీంతో ఫేస్‌బుక్‌ వేదికపై క్లారిటీ ఇచ్చింది. “బేబీ పొలెనా పుట్టింది 13 మార్చి 2012. (9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011 ). విడాకులు ఖరారు అయినది పాప పుట్టిన తరువాత అంటే 16 మార్చి 2012. ఈ వివరణ ఎందుకంటే గత కొన్నిరోజులుగా మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి, స్వప్న గారితో రేణు గారి ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ, విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారు” అంటూ వివరణ ఇచ్చింది. ఈ పోస్ట్ తర్వాత పవన్ అభిమానులకు ఎలా స్పందించాలో తెలియక వెనక్కి తగ్గారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus