Renu Desai, Pawan Kalyan: మాజీ భార్యని చూసుకోవడం లేదు ఇక్కడ రాష్ట్ర ప్రజల సంగతేంటి పవన్?

రేణు దేశాయ్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏకధాటిగా పోస్టులు చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. ఈమె పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా సినీనటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీ ఆఖీరా పుట్టినరోజు సందర్భంగా ఒక నెటిజన్ రేణు దేశాయ్ కి పోస్ట్ చేస్తూ మా అన్నయ్య కొడుకుని చూపించు అంటూ కామెంట్స్ చేశారు. నేటిజన్ ఇలా కామెంట్ చేసేసరికి రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ అన్న కొడుకు ఏంటి ఆకీరా నా కొడుకు అంటూ గట్టిగా సమాధానం చెప్పారు.

అప్పటినుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.ఈ క్రమంలోనే ఈ ఘటన గురించి ఒక నెటిజన్ రేణు దేశాయ్ కి పోస్ట్ చేస్తూ మీరు పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది అయినా మీరు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఇలా మీ గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు పెడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న పిచ్చి ఫ్యాన్స్ నోరు పవన్ ఎందుకు మూయించలేదు.

ఒక్క స్టేట్మెంట్ పాస్ చేస్తే పవన్ అభిమానులందరూ నోరు మూస్తారు కదా…రాష్ట్ర ప్రజలందరి బాధలను పట్టించుకుంటూ సమాజంలో ఆడవారికి గౌరవం ఇవ్వాలి అని చెప్పుకుంటూ తిరిగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య విషయంలో ఎందుకు గౌరవం ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఒకప్పుడు తనని ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలు ఇలాంటి మానసిక సంఘర్షణకు గురి అవుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు.

ఇలా ఒక మాజీ భార్య (Renu Desai) ప్రియురాలు బాధను పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇక రాష్ట్ర ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇలా ఎంతోమంది నన్ను సమాధానం లేని ప్రశ్నలను అడిగారు.నా కంట్రోల్లో లేని విషయాల గురించి నేను ఏ విధంగా సమాధానం చెప్పగలను అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus