ప్రముఖ టాలీవుడ్ నటి రేణు దేశాయ్ నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో ఈమె పవన్ కళ్యాణ్ అభిమానుల కారణంగా సోషల్ మీడియాలో చాలా ఇబ్బందులు పడింది. పవన్ మాజీ భార్య కాబట్టి.. ఈమె తన పిల్లలు అఖీరా, ఆద్య ఫోటోలను పోస్ట్ చేసిన ప్రతి సారి పవన్ ఫ్యాన్స్ ఏదో ఒక కామెంట్ పెట్టేవారు రేణు వాటిని పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఈమె లైవ్ లోకి వచ్చిన ప్రతీసారి వాళ్ళు ఇబ్బంది పెట్టేలా ఏదో ఒక కామెంట్ చేసేవారు.
అందుకు సహనం కోల్పోయిన రేణు ఫైర్ అవ్వడం వంటివి మనం చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాము. ఇప్పుడు మరోసారి కొందరి నెటిజెన్ల కారణంగా ఈమె ఇబ్బంది పడినట్టు తెలియజేసింది. ‘దయచేసి.. అలాంటి మెసేజ్ లు చేయకండి’ ‘మీలాంటి వాళ్ళ వల్ల వాళ్లకు నష్టం కలిగే అవకాశం ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రేణు దేశాయ్ కోవిడ్ బాధితుల కోసం.. తన వంతు సాయంగా బెడ్స్‌ను, ఆక్సిజన్ సిలిండర్లను, మెడిసిన్స్‌ను అందిస్తానని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
అయితే కొంతమంది ఆమెకు ‘హాయ్.. హలో..’ అంటూ మెసేజులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారట. దాంతో రేణు.. ‘మీరు అనవసరమైన మెసేజులు చేయడం వలన కోవిడ్ బాధితులకు సాయం అందకుండా పోయే ప్రమాదం ఉంది.ఇలాంటి మెసేజుల వల్ల బాధితుల మెసేజులు వెనక్కి వెళ్ళి పోతున్నాయి, దీంతో నేను వాటిని చూడలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి.. అలాంటి మెసేజులు పంపకండి’ అంటూ విన్నపించుకుంది.