‘ప్రభాస్’కు అవార్డ్స్ ఎందుకు రావడంలేదు??

  • July 4, 2016 / 07:05 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ప్రభాస్ ఒకడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే హిట్స్ విషయం పక్కన పెడితే మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రభాస్ కాస్త ఇమేజ్ పరంగా వెనుక బడ్డాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే క్రమంలో ప్రభాస్ ఎటువంటి కాంపిటేషన్ లేకుండా తనదైన సినిమాలతో దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే ప్రభాస్ లో లోపాలు ఉన్నాయని జాతీయ మీడియా బయట పెట్టింది. లోపాలు అంటే తప్పుగా అనుకోకండి, ఈమధ్య ప్రభాస్ కు అసలు ఒక్క అవార్డ్ కూడా రావకపోవడంతో అసలు ప్రభాస్ లో ప్రాబ్లమ్ ఏంటో అన్న కోణంలో జాతీయ మీడియా కొన్ని విషయాలు బయట పెట్టింది, అవేమిటంటే…బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించినా అవార్డుల పరంగా ఎక్కడా ప్రభాస్ కు సరైన గుర్తింపు లభించకపోవడానికి కారణం ప్రభాస్ అనుసరిస్తున్న విధానాలే అని తెలుస్తుంది. అదే క్రమంలో ఇప్పుడున్న టాప్ హీరోలందరూ తమ ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి తమ వద్ద ప్రొఫెషినల్ గా పనిచేసే పబ్లిక్ రిలేషన్ టీమ్ ను పెట్టుకుని మరీ ముందుకు సాగుతుంటే, ప్రభాస్ మాత్రం అలా ఏమీ చెయ్యకుండా పాత హీరోల పద్ధతిలో కొనసాగుతూ ఉండటం వల్ల ఈఅవార్డుల విషయంలో ప్రభాస్ వెనక పడిపోతున్నాడు అంటూ ఆంగ్ల పత్రిక వివరించింది.

అంతేకాకుండా భారీ అవార్డ్స్ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలు అన్నీ తమ అవార్డులను అందుకునే హీరోలు తమ ఈవెంట్స్ కు తప్పకుండా రావాలనే కండిషన్స్ పెడుతున్నాయని అయితే ప్రభాస్ బయట ఫంక్షన్స్ రావడానికి పెద్దగ ఆశక్తి కనపరచని నేపధ్యం కూడ ప్రభాస్ కు అవార్డులు రాకుండా అడ్డు పడుతున్న కారణం అవుతోంది అంటూ ఆంగ్ల పత్రిక చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇలా ప్రాతీ విషయంలో వెనుకబడి ఉన్న ప్రభాస్ ఈ లోపాలను ఎప్పటికీ గుర్తిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus