రజినీకాంత్ అమెరికా అందుకే వెళ్ళాడట!

  • June 29, 2016 / 10:15 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా రజినీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి టూర్స్ కి వెళ్లరు. ఇప్పటివరకు అలా వెళ్లిన దాఖలాలే లేవు. దీంతో రజిని ఆరోగ్యం పాడవడం వలనే అమెరికా వెళ్లారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆయన నటించిన కబాలి సినిమా ఆడియో ఫంక్షన్ కి కూడా రాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

కానీ ఈ విషయాలపై రజినీకాంత్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. అయితే ఇన్నిరోజులుకు ఆ రూమర్ల పై స్పందించింది రజిని కుటుంబం. తలైవా తమ్ముడు సత్యనారాయణ రజిని ఆరోగ్యం బావుందని, కొన్ని మెడికల్ టెస్టుల కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాదు కబాలి సినిమా రిలీజ్ కు ముందే ఆయన ఇండియాకు తిరిగి వచ్చేస్తారని కూడా అన్నారు. రజిని ఆరోగ్యం బాలేదని వార్తలు వస్తున్నప్పటి నుండి ఆయన అభిమానుల్లో కలత ఏర్పడింది. ఇక వారంతా హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus