Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

మామూలుగా మన సినిమా పరిశ్రమలో అంటే ఇండియన్‌ సినిమా పరిశ్రమలో హీరోలకు రిటైర్మెంట్‌ గురించి పెద్దగా ఎక్కడా డిస్కషన్ నడవదు. ఆ హీరో తనక తాను ముందుకొచ్చి నేను సినిమాలకు విరామం ఇస్తున్నాను అని చెప్పాలి కానీ.. ఎవరూ ఆ టాపిక్‌ ఎత్తరు. హీరోయిన్ల విషయంలో రిటైర్మెంట్‌ మాట ఎక్కువగానే వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు హీరోల గురించి కూడా ఆ టాపిక్‌ చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కి ఈ ప్రశ్న ఎదురైంది.

Akshay Kumar

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో.. అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. అదే ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. ఈ సినిమా రెగ్యులర్‌ పిక్చర్‌ కాదు. ఇందులో ఓ ప్రత్యేక ఉంది. అది ఆఖరున చూద్దాం. ఇక ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్రబృందం ముంబయిలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ చేసింది. ఆ వేదిక మీదే రిటైర్మెంట్‌ గురించి అక్షయ్‌కి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా అనిపించింది.

నేను రోజూ నిద్రలేచినప్పుడు రిటైర్‌మెంట్‌ గురించే ఆలోచిస్తా. కానీ ఓ ఐదు సెకన్ల తర్వాత.. సినిమా షూటింగ్ ఉందని, నా కోసం 300 మంది టీమ్‌ ఎదురుచూస్తున్నారు అని గుర్తొస్తుంది. సెట్స్‌కి వెళ్లాల్సిన టైమ్‌ వచ్చిందని వెంటనే బయలుదేరిపోతా. అలా నా రిటైర్మెంట్స్‌ ఆ ఆలోచన కేవలం ఐదు సెకన్లే ఉంటుంది. ఇలా నా కెరీర్‌లో 36 ఏళ్లు గడిచిపోయాయి అని అక్షయ్ చెప్పాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు, సినిమా టీమ్‌ నవ్వేశారు. వారితో అక్షయ్‌ కూడా శ్రుతి కలిపాడు.

ఇక సినిమా ప్రత్యేక ఉందని చెప్పాం కదా. అదేంటంఏ ఇది ‘సినిమాలో సినిమా’ నేపథ్యంతో ఉంటుంది. అంటే సినిమాలో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతూ ఉంటుంది అన్నమాట. గతంలో ఇలాంటి సినిమాలు మన దగ్గర కూడా వచ్చాయి. అయితే ఇలాంటి కాన్సెప్ట్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అక్షయ్‌ కూడా అదే మాట అంటున్నాడు. ఈ సినిమాలోని వినోదం ట్రైలర్‌లో కేవలం రెండు శాతం మాత్రమే చూపించారట.

‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus