Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు
- October 27, 2026 / 10:35 PM ISTByPhani Kumar
విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం AK-47’. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ పర్వాలేదనిపించినా.. వెంకీ-త్రివిక్రమ్ కలయిక కావడంతో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే, సెంటిమెంట్‌గా చూసుకుంటే అక్టోబర్ నెలలో వెంకటేష్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది?
Venkatesh Daggubati
గతంలో ఇదే నెలలో విడుదలైన వెంకటేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకున్నాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగానే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, అక్టోబర్ నెలలో వెంకటేష్ బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి:

1) వారసుడొచ్చాడు (1988): ఎ.మోహన్ గాంధీ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ చిత్రం 1988 అక్టోబర్ 3న విడుదలైంది. ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్‌పై హీరో రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ హిట్ ‘తీర్థ కరైయినిలే’ చిత్రానికి ఇది రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా స్ఫూర్తితోనే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అతడు’ రూపొందింది.

2) క్షణ క్షణం (1991): రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ మూవీ ఇది. 1991 అక్టోబర్ 9న విడుదలైంది. ‘శ్రీ దుర్గ ఆర్ట్స్’ బ్యానర్‌పై ‘వారణాసి’ నిర్మాతలు కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కమర్షియల్‌గా ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు టాలీవుడ్ కల్ట్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది.

3) సుందరకాండ (1992): కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, 1992 అక్టోబర్ 2న విడుదలైంది. ‘సుందర కాండం’ అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా, ‘సౌదామిని క్రియేషన్స్’ బ్యానర్‌పై కె.వి.వి.సత్యనారాయణ దీనిని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం, పాటలు ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.

4) ముద్దుల ప్రియుడు (1994): కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే రూపొందిన మరో చిత్రం ‘ముద్దుల ప్రియుడు’. 1994 అక్టోబర్ 1న విడుదలైంది. ‘ఆర్.కె.ఫిల్మ్ అసోసియేట్స్’ బ్యానర్‌పై కె.కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రంలో రంభ, రమ్యకృష్ణల గ్లామర్, కీరవాణి సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది.

5) పవిత్రబంధం (1996): ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రం 1996 అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతా చిత్ర ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై సి.వెంకటరాజు, జి.శివరాజు సంయుక్తంగా నిర్మించారు. పోసాని కృష్ణమురళి డైలాగ్స్ అందించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేశారు. కీరవాణి సంగీతం, డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. బాక్సాఫీస్ వద్ద ఈ ఫ్యామిలీ డ్రామా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

6) పెళ్ళి చేసుకుందాం (1997): ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, లైలా నటించిన ఈ చిత్రం 1997 అక్టోబర్ 9న విడుదలైంది. దీనిని కూడా ‘గీతా చిత్ర ఇంటర్నేషనల్’ సంస్థే నిర్మించింది. ఈ చిత్రానికి సైతం పోసాని, త్రివిక్రమ్ రచనా సహకారం అందించారు. ఇందులో డైలాగ్స్ చాలా బోల్డ్‌గా, ఆలోచింపజేసేలా ఉంటాయి. కోటి అందించిన సంగీతం శ్రోతలను ఎంతగానో అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

7) ప్రేమంటే ఇదేరా (1998): జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా టాలీవుడ్‌కి పరిచయమైంది. 1998 అక్టోబర్ 30న విడుదలైన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్ కుమార్ నిర్మించారు. రమణ గోగుల అందించిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

8) జయం మనదేరా (2000): ఎన్.శంకర్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2000 అక్టోబర్ 7న విడుదలైంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వెంకటేష్ మునుపెన్నడూ చూడని ఊరమాస్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

9) జెమిని (2002): శరణ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఈ చిత్రం 2002 అక్టోబర్ 11న విడుదలైంది. ‘ఏవీఎం ప్రొడక్షన్స్’, ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విక్రమ్ హీరోగా తమిళంలో సూపర్ హిట్టైన ‘జెమిని’కి ఇది రీమేక్. ఆర్.పి.పట్నాయక్ సంగీతం ఆకట్టుకున్నప్పటికీ, తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతోనే సరిపెట్టుకుంది.

10) తులసి (2007): బోయపాటి శ్రీను దర్శకత్వంలో వెంకటేష్, నయనతార జంటగా నటించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘తులసి’. 2007 అక్టోబర్ 12న విడుదలైంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై డి.సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘లక్ష్మి’ తర్వాత వెంకటేష్‌ను పూర్తి స్థాయి మాస్ రోల్‌లో ప్రెజెంట్ చేసిన చిత్రమిది. అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.

11) చింతకాయల రవి (2008): యోగి దర్శకత్వంలో వెంకటేష్, అనుష్క, మమతా మోహన్ దాస్ నటించిన సినిమా ఇది. ‘లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన ఈ చిత్రం 2008 అక్టోబర్ 2న విడుదలైంది. విశాల్-శేఖర్ సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, అంచనాలను అందుకోలేక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

12) ప్రేమమ్ (2016): నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ ఒక చిన్న కేమియో రోల్ చేశారు. ‘ఘర్షణ’ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రను గుర్తుచేస్తూ ఆయన ఇచ్చి ఎంట్రీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం 2016 అక్టోబర్ 7న విడుదలై, డీసెంట్ సక్సెస్ సాధించింది.

13) ఓరి దేవుడా (2022): అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. ‘పీవీపీ సినిమా’, ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లపై ప్రసాద్ వి. పొట్లూరి, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2022 అక్టోబర్ 21న విడుదలైంది. తమిళ హిట్ ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్
అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు
వారసుడొచ్చాడు
క్షణ క్షణం
సుందరకాండ
ముద్దుల ప్రియుడు
పవిత్రబంధం
పెళ్ళి చేసుకుందాం
ప్రేమంటే ఇదేరా
జయం మనదేరా
జెమిని
తులసి
చింతకాయల రవి
‘ఓరి దేవుడా’
Now ‘ఆదర్శ కుటుంబం’#VenkateshXTrivikram #AdarshaKutumbam #AK47 #Venkatesh #Trivikram
— Phani Kumar (@phanikumar2809) October 27, 2026













