గన్స్ అండ్ థైస్ తో సంచలనం సృష్టించడానికి సిద్ధమయిన వర్మ
- May 26, 2017 / 01:30 PM ISTByFilmy Focus
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు ఎంతోమంది దర్శకులకు స్ఫూర్తిని ఇచ్చాయి. ఆయన సినిమాలే పాఠ్య పుస్తకాలుగా తీసుకున్న టెక్నీషియన్లు చాలామంది ఉన్నారు. అటువంటి ఘనుడు ఈరోజు వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. తాను రచించిన గన్స్ అండ్ థైస్ పుస్తకం పేరుతో వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. నాలుగు సీజన్స్ లో పది ఎపిసోడ్స్ గా రానున్న ఈ సిరీస్ ట్రైలర్ నేడు రిలీజ్ అయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తన మదిలోని ఆలోచనలను పూర్తిగా ఈ వీడియోలో పొందు పరిచినట్లు స్పష్టమవుతోంది. ఇందులో రక్తపాతం, శృంగారం అధికంగా ఉన్నట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా వర్మని ఆరాధించే అభిమానులకు ఈ వెబ్ సిరీస్ చాలా బాగా ఆకట్టుకోనుంది. వెబ్ సిరీస్ రంగంలో గన్స్ అండ్ థైస్ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














