రామ్ గోపాల్ వర్మ కు ఝలక్ ఇచ్చిన సన్నీ లియోన్

వివాస్పదంగా ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నీలి చిత్రాల సుందరి సన్నీ లియోన్ ఝలక్ ఇచ్చింది. ఇతరులను విమర్శించి తన ప్రతిభను చాటుకోవటానికి ప్రయత్నించే వర్మ తనకు జరిగిన అవమానాన్ని లైట్ తీసుకున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తండ్రి తో ఉన్న చిన్ననాటి ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.

అందులో బేబీ సన్నీ చాలా ముద్దొస్తోంది. అదే విషయాన్ని వర్మ ప్రస్తావిస్తూ  “ఇటువంటి ముద్దొచ్చే పాపాయిని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు” అని పోస్ట్ చేసాడు. సన్నిలియోన్ తన పేరెంట్స్ గురించి ఎప్పుడూ మీడియాతో మాట్లాడదు. ఆమె తండ్రి కొంత కాలం క్రితం చనిపోయారు. అప్పటి నుంచి ఫాదర్స్ డే ని జరుపుకోదు. ఇటువంటి సందర్భంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ని ఆమె పట్టించుకోలేదు. సన్నీ నుంచి రిప్లై రాక పోవడంతో.. మళ్లీ ఫోటో పెట్టి ట్వీట్ చేసాడు.

ఈ సారి “సన్నీలియోన్ నువ్వు ఈ ఫొటోలో చాలా ముద్దు వస్తున్నావు. ఇలాంటి పాపాయిని నేను ఇంత వరకు చూడలేదు. నా ట్వీట్ నే నువ్వు చాక్లెట్ గా ఫీలవ్వు” అని వర్మ పోస్ట్ చేసాడు. ఇందుకు సన్నీ చాలా తెలివిగా రీట్వీట్ చేసింది. “ఐ లవ్ చాక్లెట్.. థాంక్యూ సార్..” అని సన్నీ పోస్ట్ చేసి కన్వర్జేషన్ ని అక్కడితో కట్ చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus