‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సంబంధించిన గమనిక..!

సెన్సేషనల్ డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, ట్రైలర్ తో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లక్ష్మీ పార్వతి… ఎన్టీఆర్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత నందమూరి, నారా… ఫ్యామిలీల్లో చోటు చేసుకున్న సంఘటనలు, పరిస్థితులు, అలాగే ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఒడుదుడుకులను…. వెన్నుపోటు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తుంది.

బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో లేని వాస్తవాలని ఈ చిత్రంలో చూపిస్తానని రాంగోపాల్ వర్మ చెప్పడంతో ఈ చిత్రానికి భారీ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయం పై స్పందిస్తూ… ”లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబంధించి గమనిక, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు… అని వస్తున్న రక రకాల వార్తల్లో నిజాలు లేవు… ఎవరికి ఏ రేటుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు ‘జి.వి.ఫిలిమ్స్’, ‘ఆర్.జి.వి’ మరియు రాకేష్ రెడ్డిలు త్వరలో అప్డేట్ చేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని మార్చి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus