Guppedantha Manasu August 30th: కాలేజ్ దక్కించుకోవడం కోసం మరో కన్నింగ్ ప్లాన్ వేస్తున్న శైలేంద్ర!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… రిషి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కంగారుగా వసుధార ఇంటికి ఏంజెల్ వస్తుంది అదే సమయంలో భోజనం చేస్తున్నటువంటి రిషి తనని చూసి దాక్కుంటారు. ఏంటి ఈ టైంలో వచ్చావు ఏంజెల్ అని అడగడంతో రిషి ఇప్పటివరకు ఇంటికి రాలేదు ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయడం లేదు ఇక్కడికి ఏమైనా వచ్చారా అంటూ అడగడంతో రాలేదని చెబుతుంది.

రిషి రాకపోవడంతో కంగారు పడుతున్నటువంటి ఏంజెల్ ని చూసిన రిషి 15 నిమిషాలలో ఇంటికి వస్తాను అంటూ తనకు మెసేజ్ చేస్తారు. అది చూసినటువంటి ఏంజెల్ సంతోషపడటమే కాకుండా నా మాటలు విని నాకు మెసేజ్ చేసినట్టు ఇలా వెంటనే చేశారేంటి అంటూ ఏంజెల్ సందేహం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా మీరిద్దరే కదా ఉన్నారు మూడు ప్లేట్లు ఎందుకు ఉన్నాయి కొంపతీసి రిషి గాని ఇక్కడ ఉన్నారా అని అనడంతో అల్లుడుగారు ఇక్కడ ఎందుకు ఉంటారని చక్రపాణి నోరు జారుతారు.

ఏమన్నారు అంటూ ఏంజెల్ అడగడంతో చక్రపాణి మాట మారుస్తూ మాట్లాడతారు. అయినా మీరు చేసే పనులే అర్థం కావు ఇక మీ మాటలు నాకేం అర్థమవుతాయి అంటూ ఏంజెల్ మాట్లాడటమే కాకుండా రిషి ఇంటికి వస్తానన్నారు కదా నేను తను వచ్చేలోపు ఇంటి దగ్గర ఉండాలి అంటూ ఏంజెల్ బయలుదేరుతుంది. ఏంజెల్ వెళ్లగానే రిషి బయటకు వస్తారు. తను మీకోసం చాలా ఎదురు చూస్తుంది మీరు వెళ్ళండి సర్ అని చెప్పగా తాను వెళ్ళననీ ఏంజెల్ ను ఫేస్ చేయలేనని రిషి చెపుతాడు. ఇలా భయపడి పారిపోవడం కాదు విశ్వనాథం గారిని చూసి వెళ్ళండి అంటూ రిషిని అక్కడి నుంచి పంపిస్తుంది.

మరుసటి రోజు ఉదయం రిషి విశ్వనాథం కి విష్ చేస్తారు అయితే అప్పటి వరకు అక్కడే ఉన్నటువంటి ఏంజెల్ లోపలికి వెళ్లిపోవడంతో ఏంటి మీ ఇద్దరి ఏమైనా గొడవపడ్డారా అంటూ విశ్వం అడగగా రిషి ఏంజెల్ ను పిలిచి మనిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా మనిద్దరం మంచి స్నేహితులు మాత్రమే అంటూ ఒత్తి పలికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్లిపోయిన నేను వదలను అంటూ ఏంజెల్ సైతం తన వెనుకే వెళ్లి నువ్వు నా ప్రపోజల్ ను సీరియస్గా తీసుకోవడం లేదు అంటూ అడుగుతుంది. ఇలా రిషితనని అవాయిడ్ చేస్తున్న సరే ఏంజెల్ మాటికి తన ప్రపోజల్ గురించి అడగడంతో రిషి సీరియస్ అవుతారు.

నేను ఎప్పుడో నీకు నా నిర్ణయం చెప్పేశాను అని రిషి చెప్పగా నేను విశ్వంకి ఈ విషయం చెబుతాను అని ఏంజెల్ చెప్పడంతో నువ్వు తనకి చెప్పిన నా నిర్ణయం మారదు చెప్పి తనని బాధ పెట్టాలి అనుకుంటే చెప్పేసేయ్ అంటూ రిషి మాట్లాడతారు. మరోవైపు శైలేంద్ర ఎలాగైనా కాలేజీ తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కాలేజ్ మేనేజర్ నరేష్ అనే వ్యక్తి కూతురు పెళ్లి కుదిరిందని తెలిసి ఆయనకు డబ్బు సహాయం చేస్తాను కాకపోతే నేను అడిగిన పని చేసి పెట్టాలి అంటూ తన ప్లాన్ చెబుతారు ప్లాన్ మొత్తం విన్నటువంటి నరేష్ భయంగా ఉంది సార్ అంటూ మాట్లాడుతారు.

ఇలా భయం ఉన్నప్పుడే పనులు చాలా చక్కగా పూర్తి అవుతాయి అంటూ శైలేంద్ర మరొక ప్లాన్ సిద్ధం చేశారు. మరోవైపు ఏంజెల్ వసుధారని పిలిచి రిషి ఎందుకు నా ప్రపోజల్ సీరియస్గా తీసుకోవడం లేదు నువ్వైనా చెప్పు అనడంతో మీ ఇద్దరి మధ్య నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటూ వసుధార మాట్లాడుతుంది. నువ్వు అలా మాట్లాడకు వసుధర ఇది నా లైఫ్ అండ్ డెత్ మేటర్ అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి రిషి వస్తారు. నువ్వు నా ప్రపోజల్ సీరియస్గా తీసుకోవడం లేదు కదా నేను ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నానో వసుధార నీకు చెబుతుంది అంటూ ఏంజెల్ మాట్లాడుతుంది. అప్పుడు వసుధార మాట్లాడుతూ ఒక ఆడపిల్ల అయినా సిగ్గు విడిచి అడుగుతుంది చెప్పండి సార్ ఏంటి మీ మనసులో ఎవరైనా ఉన్నారా అంటూ రిషి ని ఇరకాటంలో పడేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus