Guppedantha Manasu August 31st: నచ్చిన వాడితోనే ఏంజెల్ కు పెళ్లి చేయడానికి సిద్ధమైన రిషి !

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి ఈ సీరియల్ లో భాగంగా నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయానికి వస్తే రిషి ప్రేమ విషయాన్ని నేను ఎంత సీరియస్గా తీసుకున్నానో తనకు అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు వసుధారా అంటూ ఏంజెల్ అడగడంతో తాను అలా అడుగుతుంది కదా సర్ మీ నిర్ణయం ఏంటో చెప్పండి మీ మనసులో ఎవరైనా ఉన్నారా అంటూ రిషి ని అడగడంతో రిషి మాత్రం సీరియస్ అవుతూ నా నిర్ణయం ఇదివరకే చెప్పాను అంటూ కోప్పడతారు. అదేవిధంగా ఏంజెల్ వద్దకు వెళ్లి మన పర్సనల్ విషయాల గురించి బయట వ్యక్తులతో మాట్లాడటం అవసరమా నా నిర్ణయం ఏంటో నీకు ఎప్పుడో చెప్పాను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఏంజెల్ పై సీరియస్ అవుతారు.

ఈ విధంగా రిషి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో చేసేదేమీ లేక వసుధార ఏంజెల్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లినటువంటి వసుధార రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా చక్రపాణి వచ్చి ఏం జరిగిందమ్మా అంటూ అడుగుతారు. రిషి సార్ మనసులో నేను ఉన్నానని తెలుసు. అయినా కూడా సార్ బయటపడటం లేదు ఈ విషయం తెలుసుకోవడం కోసమే నేను తనని చాలా ఇబ్బంది పెడుతున్నాను నాన్న అంటూ వసుధార మాట్లాడుతుంది. కొన్ని మనసులో ఉన్నప్పటికీ బయటపడటానికి కాస్త సమయం పడుతుందని చక్రపాణి చెబుతారు. ఆరోజు నువ్వు డల్ గా ఉన్నందుకే అల్లుడుగారు ఇక్కడికి వచ్చి నీకేమైందోనని ఆరా తీశారు ఆ రోజు నేను ఆయన కళ్ళల్లో నీపై ఉన్నటువంటి ప్రేమ చూశాను.

అల్లుడుగారిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది ఆయనకు కొంత సమయం ఇస్తే తప్పకుండా మారుతారు అంటూ చక్రపాణి తన కూతురికి ధైర్యం చెబుతారు. మరోవైపు రిషి కూడా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎందుకు వసుధారా నన్ను ఇలా బాధ పెడుతున్నావు నా మనసులో ఏముందో నీకు తెలుసు. నా మనసులో ఏముందో నాతోనే చెప్పించాలని చూస్తున్నావు అలా ఎలా కుదురుతుంది అంటూ రిషి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఏంజెల్ కూడా నన్ను పెళ్లి గురించి బలవంతం చేస్తుంది తనకు ఎన్నిసార్లు అర్థమయ్యేలా చెప్పిన అలాగే ప్రవర్తిస్తుందంటూ ఏంజెల్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు.

ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే సరిపోదు విశ్వనాథం గారికి చెప్పి ఏదో ఒకటి నిర్ణయించాలని ఆయన వద్దకు వెళ్తాడు అక్కడికి వెళ్లినటువంటి రిషి ఏంజెల్ పెళ్లి గురించి మాట్లాడుతూ తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని చెబుతారు తన మనసులో ఎవరో ఉన్నారు ఆ విషయం చెబితే పెళ్లి చేద్దామంటూ విశ్వనాథం చెబుతారు. అంతలోపు అక్కడికి ఏంజెల్ రాగా రిషి నీకు పెళ్లి సంబంధం చూడాలని చెబుతున్నారు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అంటూ విశ్వనాథం అడగగా రిషి అంటూ ఏంజెల్ మాట్లాడటంతో విశ్వనాథం షాక్ అవుతారు. ఆ తర్వాత ఏంజెల్ కవర్ చేస్తూ నువ్వు నా పెళ్ళికి పెద్ద అయ్యావా? నా మనసులో ఎవరున్నారు అనే విషయం కచ్చితంగా చెబుతాను కొంత సమయం ఇవ్వండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

రిషి బయటకు రాగానే నా మనసులో ఉన్నది నువ్వేనని నీకు తెలుసు ఆయన ఇప్పటికీ నాకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తావా రిషి అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు కూడా రిషి మాట్లాడుతూ నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదని నీకు ఎప్పుడో చెప్పాను ఇకపై కూడా నా నిర్ణయం మారదు అంటూ చెబుతారు. ఇకపోతే కాలేజీ స్టాప్ కు ఇంకా శాలరీ పడలేదని విషయం తెలియడంతో జగతి కంగారుపడుతుంది. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆమె షాక్ అవుతూ మేనేజర్ ను అక్కడికి పిలిపించి తనని అడుగుతుంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus