డ్యాన్సర్ సరసన బాక్సర్!
- June 27, 2016 / 05:43 AM ISTByFilmy Focus
బాక్సర్ గా ఒలింపిక్స్ కు కాకపోయినా కనీసం స్టేట్ లెవెల్ లో అయినా పోటీ చేయాల్సిన రీతికా సింగ్ “యాక్టింగ్” అంటూ సినిమాల్లోకి తీసుకొచ్చేశాడు. ఇప్పుడేమో అమ్మడు సినిమాలు వదలనంటోంది. “సాలా ఖద్దూస్”తో పరిచయమైన బాక్సర్ రితికా సింగ్, ఇక తన బాక్సింగ్ కెరీర్ ను పక్కనపెట్టి సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని ఫిక్సయిపోయింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత లారెన్స్ హీరోగా తెరకెక్కనున్న మరో సినిమాలోనూ రితికాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కన్నడలో సూపర్ హిట్ అయిన “శివలింగ” అనే చిత్రాన్ని తమిళంలో “శివలింగ” అనే పేరుతో రీమేక్ చేయనున్నారు. పి.వాసు ఈ తమిళ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తారు. శివరాజ్ కుమార్ పాత్రను లారెన్స్ పోషించనుండగా.. వేదిక పాత్రలో రితికా సింగ్ కనిపించనుంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













