‘పెళ్ళిచూపులు’ బ్యూటీకి మరో అవకాశం!
- August 8, 2016 / 11:29 AM ISTByFilmy Focus
లఘు చిత్రాలతో కెరీర్ ఆరంభించి ‘బాద్ షా’,’ఎవడే సుబ్రమణ్యం’ వంటి చిత్రాల్లో నటించిన భామ రీతూవర్మ. రీసెంట్ గా ఈ భామ పూర్తి స్థాయి హీరోయిన్ గా పెళ్ళిచూపులు సినిమాలో నటించింది. ఈ సినిమాతో యూత్ లో రీతూకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ‘క్షణం’ సినిమా టీంతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. దీనికి ‘గూఢాచారి’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమాలో అడివిశేష్ కు జంటగా ముందు ఆదా శర్మను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆదాను తప్పించి ఆమె స్థానంలోకి రీతూవర్మను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మాత్రమే కాకుండా రీతూ మరో మూడు ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రీతూ భవిష్యత్తు ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














