తమిళ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రోబో శంకర్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు ఇలా సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటించే సందడి చేసినటువంటి రోబో శంకర్ తాజాగా ఒక తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన గురించి అలాగే హీరో ధనుష్ గురించి పలు విషయాలను వెల్లడించారు.
రోబో శంకర్ మాట్లాడుతూ తాను మద్యానికి చాలా బానిసగా మారిపోయానని తెలియజేశారు. ఎప్పుడు మద్యం సేవిస్తూ ఉంటానని అయితే నేను తాగడం చూసి హీరో ధనుష్ మద్యం మానేయి అంటూ నాకు ఎన్నోసార్లు సలహా ఇచ్చారు కానీ నేను మాత్రం మానుకోలేదు. అయితే హీరో ధనుష్ కి కూడా బాగా తాగే అలవాటు ఉంది. అయితే ఆయన ఈ అలవాటు నుంచి బయట పడాలని అనుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మద్యం తాగలేదు.
ఇక ఏదైనా పార్టీలకు వెళ్లినా కూడా ఆయన డ్రింక్ చేసేవారు కాదు ఇలా డ్రింక్ మానేయడమే కాకుండా పూర్తిగా వెజిటేరియన్ గా కూడా మారిపోయారు. అయితే నన్ను కూడా తాగడం మానుకోవాలని ఎన్నో సార్లు చెప్పినప్పటికీ నేను వినలేదని ఇలా బాగా తాగుడుకు బానిసయి చివరికి మరణం అంచులు దాకా వెళ్లి వచ్చానని రోబో శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ధనుష్ (Dhanush) నటించిన మారి సినిమాలో నాకు అవకాశం కల్పించారని ఆయన నాకు ఈ సినిమా అవకాశం కల్పించడమే కాకుండా తన జీవితాన్ని కూడా మార్చేశారు అంటూ ఈ సందర్భంగా శంకర్ హీరో ధనుష్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన అనారోగ్య సమస్యల కారణంగా గత కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చేరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నటువంటి శంకర్ ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలను అందుకుంటు బిజీ అవుతున్నారు.