బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న నటి రోహిణి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన అద్భుతమైన మాటతీరుతో డైలాగ్ తో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బుల్లి తెర పై పెద్ద ఎత్తున సందడి చేస్తున్న ఈమె వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా ఒకవైపు సీరియల్స్ సినిమాలలో నటిస్తూనే ఎంతో బిజీగా ఉన్నటువంటి రోహిణి మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే (Rohini) తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుని ఈమె గత కొద్దిరోజులుగా తాను హాస్పిటల్ కి సర్జరీ కోసం వెళ్లగా డాక్టర్లు చేతులెత్తేసారంటే ఒక వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2016 వ సంవత్సరంలో తనకు ప్రమాదం జరగడంతో కాలు ఫ్రాక్చర్ అయిందని అయితే అప్పుడు డాక్టర్లు రాడ్ వేసి సర్జరీ చేశారని తెలిపారు. అయితే ఆ రాడ్ అలాగే ఉందని ప్రస్తుతం ఆ రాడ్ వల్ల తాను కొన్ని డాన్స్ మూమెంట్స్ చేయలేకపోతున్నానని అందుకే రాడ్ తీసేయించుకోవడం కోసం సర్జరీ చేయించుకోబోతున్నానని తెలిపారు.
ఈ సర్జరీ కోసం హైదరాబాద్లోని ఒక హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ డాక్టర్లు రాడ్ తొలగించడానికి రాదని బలవంతంగా తీస్తే ఖాళీ ఎముక పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారంటూ తెలిపారు. వైద్యులు ఇలా చెప్పడంతో ఈమె చేసేది ఏమీ లేక గతంలో తనకు సర్జరీ చేసి రాడ్ వేసిన డాక్టర్ కోసం తాను విజయవాడ వచ్చానని తెలిపారు. అయితే డాక్టర్లు సుమారు 10 గంటల పాటు కష్టపడి తనకు సర్జరీ చేసే తన కాలిలో ఉన్నటువంటి సక్సెస్ ఫుల్ గా బయటకు తీసారని తెలియజేశారు.
అయితే ఆరువారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్టు ఈమె తెలియజేశారు. అంతవరకు తాను తన షూటింగ్లకు విరామం ఇస్తున్నానంటూ ఈ సందర్భంగా రోహిణి చెబుతూ చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.