ఒకప్పటి స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు, ‘జబర్దస్త్’ జడ్జి అయిన రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ.. మరోపక్క బుల్లితెర పై అలాగే వెండితెర పై కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అలాగే రోజా తన కుటుంబం పట్ల కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది రోజా.
ఇదిలా ఉండగా.. ఇటీవల రోజా కి చిన్నపాటి సర్జరీ కూడా జరిగిన సంగతి తెలిసిందే.దీంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని ఆమె భర్త సెల్వమణి క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మొత్తానికి రోజా తొందరగానే కోలుకున్నారు.ఇది పక్కన పెడితే తాజాగా రోజా కొడుకు కృష్ణ లోహిత్ సెల్వమణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :