Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ వంటి ‘ఎ’ రేటింగ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు. అలాంటి దర్శకుడు ఓ సినిమాని నిర్మిస్తుంటే.. అది కూడా ‘ఎ’ రేటింగ్ సినిమానే అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అలా ఫిక్స్ అయిన వారందరికీ షాక్ ఇస్తూ.. ‘రోమాంచకం'(Romanchakam) అనే రామ్ కామ్ మూవీ రూపొందించారు సందీప్ రెడ్డి వంగా. ‘భద్రకాళి పిక్షర్స్’ సంస్థ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక హీరో హీరోయిన్లుగా నటించారు.

Romanchakam

వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, ట్రైలర్ వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి. యూత్ ఫుల్ కామిడీ ఎంటర్టైనర్ ఇది అనే భరోసా అందరికీ కలిగించాయి. నిన్న ‘రోమాంచకం’ టీమ్ ‘స్పిరిట్’ హీరో ప్రభాస్ ను కలవడం జరిగింది. ఈ సినిమాకి తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ.. ప్రభాస్ తన వీరాభిమాని అయిన సుమంత్ వైట్ షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇవ్వడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది.

సెప్టెంబర్ 3న విడుదల కాబోతున్న ఈ సినిమాని ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న తమ స్నేహితులకి చూపించారు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ‘రోమాంచకం’ సినిమా 2 గంటల 23 నిమిషాల నిడివి కలిగి ఉందట. నేటి యువత ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ సినిమా కథ, కథనాలు ఉన్నాయట. హీరో, హీరోయిన్ల మధ్య ఒక క్రేజీ ‘లవ్ అండ్ హేట్’ రిలేషన్ షిప్ చుట్టూ ఈ కథ నడుస్తుందట.

ఒకరినొకరు ద్వేషించుకుంటూనే, అనుకోకుండా వాళ్ళ మధ్య ప్రేమ ఎలా చిగురించడం అనేది కథలోని ట్విస్ట్ అని అంటున్నారు. వీరి ప్రేమకథలో స్నేహితుల హంగామా, వాళ్ళు ఇచ్చే ఉచిత సలహాల వల్ల వచ్చే చికాకులు వంటివి ఆడియన్స్ ను అలరించే విధంగా ఉంటాయట. అలాగే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, పోలీస్ స్టేషన్ సెటప్, ఆన్లైన్ డేటింగ్ వంటి అంశాలు కూడా ఉంటాయట. వాటితో చిన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారట.

మొత్తంగా ‘రోమాంచకం’ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని, కామిడీ కూడా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందో..!

‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus