సుమ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ త్వరలోనే హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల ఆనంద నేపథ్యంలో రోషన్ ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలకు హాజరైన సంగతి తెలిసిందే.ఇలా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యారు ముఖ్యంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్నటువంటి లిప్ కి సన్నివేశాల గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. మొదటి సినిమాకి ఇలాంటి సీన్స్ లో చేసి రోషన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఈ సన్నివేశాల గురించి రోషన్ ను యాంకర్ ప్రశ్నిస్తూ ఈ లిప్ కి సన్నివేశాన్ని చేయడం కోసం సుమారు ఒక 150 టేకుల వరకు తీసుకొని ఉంటారా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రోషన్ (Roshan) ఒక్కసారిగా యాంకర్ పై సీరియస్ అయ్యారు ఇలా కేవలం కిస్ సన్నివేశాల కోసమే అన్ని సార్లు టేకులు తీసుకోవడం ఏంటి అన్న ఉద్దేశంతో ఈయన యాంకర్ పై సీరియస్ అవ్వడమే కాకుండా ఈ ఇంటర్వ్యూ మధ్యలో నుంచి కూడా బయటకు వెళ్లిపోయారు. ఇలా రోషన్ బయటకు వెళ్లిపోవడంతో అందరూ షాక్ అయ్యారు కానీ ఈయన బయటకు వెళ్లి హీరోయిన్ ను తన వెంట తీసుకువచ్చారు.
ఇలా హీరోయిన్ ను తీసుకొని వచ్చి లిప్ కిస్ సన్నివేశాలకు ఎన్ని టేక్స్ తీసుకున్నామో తనకు చెప్పు అంటూ రోషన్ కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈయన సరదాగానే అలా బయటకు వెళ్లి హీరోయిన్ ను తీసుకువచ్చారని నిజంగానే యాంకర్ పై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోలేదని తెలుస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో హీరోలందరూ కూడా చాలా విభిన్నంగా సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!