రాజమౌళి హీరోయిన్ ప్రెగ్నెంట్ .. వైరల్?

పెళ్ళికి ముందే తల్లికావడం అనే విషయం మనకి విడ్డూరంగా అనిపించవచ్చు.. చెప్పాలంటే తప్పుగా కూడా అనిపించవచ్చు. కానీ.. విదేశాల్లో ఉన్న వారికి ఇది సర్వసాధారణమైన విషయం. విదేశాల్లో ఉంటున్న వారు.. సహజీవనం పేరుతో సంసారం చేసి పిల్లల్ని కనడం ఎప్పటినుండో మనం చూస్తూనే వస్తున్నాం. మెల్లగా ఇది మన భారతదేశానికి కూడా పాకింది. ముఖ్యంగా సినిమావాళ్ళ దయవల్ల ఈ విషయం అందరికీ తెలిసిందనేది వాస్తవం. గతంలో ఓ స్టార్ హీరోలు సహజీవనం చేస్తున్నట్టు బహిరంగంగానే వెల్లడించి షాక్ ఇచ్చారు.

ఇక ఆ తరువాత చాలా మంది నటీనటుల సహజీవనం వార్తలు బయటకు వచ్చాయి.’ఎవడు’ ‘ఐ’ ‘రోబో2’.. హీరోయిన్ అమీ జాక్సన్ కూడా పెళ్లి కాకుండానే తల్లి అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోయిన్ కూడా పెళ్లి కాకుండానే తల్లికాబోతుందట. ఆమె ఎవరో కాదు.. ఎమ్మా రాబర్ట్స్. ఈమె‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.! ఎందుకంటే.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఎమ్మా రాబర్ట్స్‌ను.. ఎన్టీఆర్‌కు జోడిగా ఎంపిక చేసుకోవడానికి రాజమౌళి ప్రయత్నాలు జరిపాడు.

ఈ విషయం పై 2019 జూలైలో ఎన్నో వార్తలు రావడంతో ఈమె పాపులర్ అయ్యింది. కానీ ఈమె ఈ ప్రాజెక్ట్ కు ఫైనల్ కాలేదు. అయితే ఈమె తల్లి కాబోతుంది అన్న విషయాన్ని ఎమ్మా రాబర్ట్స్ తల్లి కెల్లీ కన్నిగ్హం వెల్లడించి అందరికీ షాకిచ్చింది. గెర్రెట్ హెడ్‌లుడ్‌తో ఎమ్మా రాబర్ట్స్ డేటింగ్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus