RRR సీడెడ్ లో ఎంత పలికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

  • June 23, 2020 / 06:00 PM IST

‘బాహుబలి’ లాంటి భారీ విజయం తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం ‘RRR’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇటీవల సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో సినిమా బిజినెస్ కూడా మొదలైంది. భారీ రేటుకి ఈ సినిమా రైట్స్ ని దక్కించుకుంటున్నారు బయ్యర్లు. సీడెడ్ ప్రాంతంలో సినిమాకి భారీ ధర పలికినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. మొత్తం రూ.35 కోట్లకు పైగా సీడెడ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus