చరణ్, ఎన్టీఆర్ లకు హీరోయిన్స్ ని ఫైనల్ చేసిన రాజమౌళి…!

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. జూ.ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని డీ.వి.వి.దానయ్య దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ను కూడా మొదలు పెట్టినప్పటికీ… ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.

రాజమౌళి మాత్రం హీరోయిన్స్ విషయంలో మాత్రం ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నాడట. ఈ విషయం పై హీరోయిన్స్ తో డిస్కషన్స్ కూడా పూర్తయిపోయాయని తెలుస్తుంది. అయితే అధికారికంగా ప్రకటించడమే లేటని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, కైరా అద్వానీలనే సెలెక్ట్ చేశాడట జక్కన్న. అంతేకాదు ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఇందుకోసం ప్రియమణి లేదా కాజల్ అగర్వాల్ ను అనుకుంటున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ హీరోయిన్లు ఎవరి చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరికి జంటగా నటిస్తున్నారో తెలియాల్సి ఉంది. స్వాతంత్రం పోరాట నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus