Rudhrudu: ‘రుద్రుడు’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • April 14, 2023 / 07:40 PM IST

స్టార్ కొరియోగ్రాఫర్, టాప్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి’ బ్యానర్ పై కతిరేశన్ సమర్పణలో ‘పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్’ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు.

లారెన్స్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో లారెన్స్ సినిమా అంటే కచ్చితంగా హౌస్ ఫుల్స్ పడతాయనే నమ్మకం ఇక్కడి బయ్యర్స్ లో ఉంది. అందుకే ‘రుద్రుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 2.50 cr
సీడెడ్ 0.85 cr
ఆంధ్ర(టోటల్) 3.20 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 6.55 cr

‘రుద్రుడు’ (Rudhrudu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ పాజిటివ్ గా వస్తే పర్వాలేదు.. లేకపోతే కనుక జనాలకు సమంత ‘శాకుంతలం’ చిత్రం పోటీగా ఉంది. అయితే లారెన్స్ గత సినిమాలు ‘కాంచన 3’ ‘శివలింగ’ వంటి సినిమాలు రూ.9 కోట్ల టార్గెట్ ను కూడా ఈజీగా రీచ్ అయ్యాయి. మరి ‘రుద్రుడు’ ఏం చేస్తుందో చూడాలి..!

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus