Brahmamudi September 9th: నిజం చెప్పమంటూ కొడుకుని నిలదీసిన అపర్ణ!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… కావ్య మల్లెపూలు పాల గ్లాసుతో గదిలోకి రావడంతో షాక్ అయినటువంటి రాజ్ మూడు నెలలకు సమయం కావాలి అని అడిగాను కదా మరి ఇదేంటి అని చెప్పడంతో మీరేమో కంగారు పడకండి ఈ పూలు అమ్మమ్మ గారు పెట్టారు పాలు చిన్న అత్తయ్య గారు ఇచ్చారు. ఈ పాలు తాగి మీరు ప్రశాంతంగా నిద్రపోండి అంటూ మాట్లాడుతుంది. మరోవైపు కళ్యాణ్ అనామిక గురించి ఆలోచిస్తూ మీ పేరెంట్స్ కి కూడా నన్ను పరిచయం చేస్తావు నీ మనసులో నా ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలి అంటూ అప్పు కి ఫోన్ చేస్తారు.

కళ్యాణ్ ఫోన్ చేయడంతో అప్పు లిఫ్ట్ చేయదు కట్ చేస్తుంది. కళ్యాణ్ మరోసారి ఫోన్ చేయగా అప్పు కట్ చేస్తుంది అలాగే చేస్తూ ఉండడంతో ఫోన్ కట్ చేస్తున్నానంటే చేయకూడదని తెలియదా మాటిమాటికి అలా చేస్తున్నవ్ ఏంటి అని అప్పు మాట్లాడుతూ ఉంటుంది అదే సమయంలో అనామిక ఫోన్ చేయడంతో కళ్యాణ్ అప్పు ఫోన్ కట్ చేసి మరి తనతో మాట్లాడుతూ ఉంటారు. దీంతో కోప్పడిన అప్పు తిరిగి మరోసారి కళ్యాణ్ కి ఫోన్ చేయగా కాల్ కట్ చేయడంతో ఈసారి నాతో మాట్లాడతావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ కోప్పడుతుంది.

మరోవైపు కనకం వెళ్తూ ఉండగా తనకు రోడ్డుపై కారులో రాహుల్ వెళ్లడం కనిపిస్తుంద. దీంతో షాక్ అయినటువంటి కనకం వీళ్ళు హనీమూన్ లో ఉన్నారని చెప్పారు అదేంటి మరి రాహుల్ ఇక్కడ తిరుగుతున్నారు అని సందేహపడుతూ రుద్రానికి ఫోన్ చేస్తుంది. రాహుల్ స్వప్న హనీమూన్ వెళ్లారని చెప్పారు కానీ రాహుల్ మణికొండలో ఉన్నారని కనకం మాట్లాడటంతో ఒక్కసారి రుద్రాణి షాక్ అవుతుంది. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో వాడు ఊటీలో ఉన్నారని నాకు ఫోన్ చేశారా అయినా మీరు మీ అమ్మాయితో మాట్లాడలేదా మీ అమ్మాయి చెప్పలేదా అనడంతో కనకం అవును మా అమ్మాయి చెప్పింది ఈ గడ్డం పెంచుకోవడంతో ఎవరు ఏంటో అని గుర్తుపట్టలేకపోతున్నాము అంటూ ఫోన్ పెట్టేస్తుంది.

రుద్రాణి వెంటనే తన కొడుకుకి ఫోన్ చేసి జరిగినది మొత్తం చెబుతుంది పని పూర్తి అయ్యేవరకు నువ్వు బయట తిరగకు అంటూ తన కొడుకుకి వార్నింగ్ ఇస్తుంది. ఇక కావ్య కృష్ణుడికి పూజ చేయడంతో రుద్రాణి వచ్చి ప్రతిరోజు ఈ పూజలు ఏంటి ఈ గోల ఏంటి అని అనడంతో ఇంట్లో వారందరూ కూడా తనని తిడతారు. ఇక రాజ్ సైతం నీకు పూజ చేయడం పూజలు నచ్చకపోతే బయటకు రాకు నీ గదిలోనే ఉండు అత్తయ్య అంటూ తనపై కోప్పడతారు. మరోవైపు కనకం కూడా కృష్ణుడికి పూజ చేస్తుంది. అంతలోపు అప్పుకి ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తున్న వాడి అంతు తేలుస్తా అంటూ అప్పు బయటకు పోవడంతో ఎక్కడికి వెళ్ళేది మరోసారి గొడవ తీసుకురావడానికి వెళ్తున్నావా అంటూ తన తల్లి గదిలో పెట్టి బంధిస్తుంది.

తర్వాత భాగంలో కావ్య ఎమోషనల్ అవుతూ నా కాపురం ఎక్కడ చెడిపోతుందో అనుకున్నాను ఇప్పుడు నన్ను ఆయన భార్యగా అంగీకరిస్తున్నారు అంటూ చిట్టితో చెప్పగా ఆ మాటలు విన్నటువంటి అపర్ణ తన కొడుకును గదిలోకి తీసుకువెళ్లి అసలు ఏం జరుగుతుందో నిజం చెప్పమంటూ నిలదీస్తుంది.

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus