ఆర్ఎక్స్ 100 ఐదు రోజుల కలెక్షన్స్!

  • July 17, 2018 / 10:10 AM IST

ఆశించినంతగా విజయం సాధిస్తే ఆనందం. అంతకు మించి విజయం అందుకుంటే బ్రహ్మనందం. అటువంటి విజయాన్ని ఆర్ఎక్స్ 100 చిత్ర బృందం ఆస్వాదిస్తోంది. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈనెల 12 న రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజు నుంచి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ సాగిపోతోంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ రెండు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం నాలుగురోజుల్లోనే 5.18 కోట్ల షేర్ అందుకొని ఔరా అనిపించింది. ఐదురోజుల్లో 6 .14 కోట్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 2,90,81,287
సీడెడ్ : 70,49,048ఉత్తరాంధ్ర : 71,04,571
గుంటూరు : 41,72,183కృష్ణ : 39,18,451
ఈస్ట్ గోదావరి : 49,29,005
వెస్ట్ గోదావరి : 38,58,962నెల్లూరు : 13,22,730
తెలుగు రాష్ట్రాల్లో : 6,14,36,237

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus