హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న పాయల్ రాజ్‌పుత్!

  • June 12, 2018 / 07:39 AM IST

బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి ఎంతోమందు దుమ్ములేపారు. తాజాగా బుల్లితెర నటి పాయల్ రాజ్‌పుత్ టాప్ లేపుతోంది. హిందీ టీవీ సీరియల్లో అందరికి పరిచయమైన ఈ భామ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి‌ దర్శకత్వం వహించిన “ఆర్‌ఎక్స్ 100” చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమవుతోంది. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ లో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ గా నటించి హీట్ పుట్టిస్తోంది. ఈ వీడియోలు యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో హీరోగా నటించిన కార్తికేయ చాలా రఫ్‌గా, మాస్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా కనిపిస్తుంటే.. మాస్ కథకి మసాలా జోడించినట్టుగా పాయల్ అందాలను ఆరబోస్తోంది.

ఈ భామ‌ ఘాటైన లిప్‌లాక్‌లు, వేడెక్కించే స‌న్నివేశాల‌తో దుమ్ము రేపేసింది. రావురమేష్ విలన్‌గా, సీనియర్ హీరో రాంకీ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ సినిమాకి హీరోయిన్ మరింత ప్లస్ కానుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాలోనే కాకుండా సోషల్ మీడియా అకౌంట్ లోను హాట్ ఫొటోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యధిక షేర్లు, లైక్లు అందుకుంటున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus