విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ బహుమతులు!

Advertisement

ఒక్కోసారి విజయం అందుకోవడం కంటే ఆ విజయాన్ని నలుగురితో పంచుకొన్నప్పుడే విజయానందాన్ని ఆస్వాదించగలుగుతాం. “ఆర్ ఎక్స్ 100” టీం ఇప్పుడు ఆ పనిలోనే ఉంది. రెండున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 12 కోట్ల రూపాయలు వసూలు చేసి అఖండ విజయం సొంతం చేసుకోంది. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఆనందాన్ని తాము మాత్రమే కాక టీం మొత్తం ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే.. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ “ఐఫోన్ 7″ను గిఫ్ట్ గా ఇచ్చారు. పేమెంట్ లు పూర్తిగా ఇవ్వడమే గగనమైపోతున్న తరుణంలో.. సక్సెస్ లో భాగమైన తామందరి పేర్లు, ఫోటోలతో సహా ఫ్లెక్సీలు వేయించిన దర్శకనిర్మాతలు.. ఇప్పుడు ఇలా అనుకోని విధంగా అందరికీ ఐఫోన్ లు గిఫ్ట్ ఇవ్వడంతో పట్టరాని ఆనందంలో మునిగితేలుతున్నారు.

చాలా చిన్న సినిమాగా విడుదలైన “ఆర్ ఎక్స్ 100” సృష్టించిన సంచలనాలు తక్కువేమీ కావు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుట్ కి ఆఫర్లు వెల్లువెత్తుతుండగా.. హీరో కార్తికేయ ఆల్రెడీ హీరోగా ఒక సినిమా సైన్ చేశాడు. ఇక డైరెక్టర్ అజయ్ భూపతికి ఇప్పటికే రెండుమూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అడ్వాన్సులు ఇచ్చిన విషయం తెలిసిందే. చూస్తుంటే.. అప్పట్లో “ఈరోజుల్లో” ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు ఆర్.ఎక్స్ 100 కూడా అదే స్థాయి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయనుందని అర్ధమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus