అజయ్ భూపతికి ఖరీదైన కారుని కానుకగా ఇచ్చిన నిర్మాత

Advertisement

నటీనటుల నుంచి నటనను బయటికి తెప్పించడం, టెక్నీషియన్ల ప్రతిభని వినియోగించుకోవడం మాత్రమే కాదు అనుకున్న బడ్జెట్ లో సినిమాని కంప్లీట్ చేయడం కూడా దర్శకుడి పనుల్లో భాగమే. అలా చేసినప్పుడు.. సినిమా సగం విజయం సాధించినట్టే అవుతుంది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే పూర్తి విజయం అందుకున్నట్టే. అలాంటి విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా అనేక సినిమాలకు పనిచేసిన ఇతను తొలిసారి దర్శకుడిగా మరి చేసి తీసిన మూవీ ఆర్ఎక్స్ 100 . చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది.

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టి 20 కోట్ల గ్రాస్ ని అధిగమించి దూసుకుపోతోంది. నిర్మాతకు, డిస్టిబ్యూటర్స్ కి భారీ లాభాలని అందించింది. అందుకే నిర్మాత ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లకు లక్ష రూపాయల విలువైన ఫోన్లను గిఫ్ట్ గా అందించారు. తాజాగా దర్శకుడు అజయ్ భూపతికి .. నిర్మాత అశోక్ గుమ్మకొండ ఖరీదైన కారును కానుకగా అందజేశారు. తన తొలి సినిమా ఇంతలా విజయం సాధించినందుకు అజయ్ భూపతి సంతోషంగా ఉన్నారు. కారు గిఫ్ట్ గా రావడంతో ఆనందం రెట్టింపు అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus