మజిలీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వకుండా తమన్ స్పెషల్ కేర్

  • March 20, 2019 / 07:07 PM IST

వివాహం చేసుకున్న అనంతరం నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న “మజిలీ” చిత్రం ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఉన్నట్లుండి సినిమా విడుదల విషయంలో సమస్యలు తలెత్తాయి. అయితే.. ఆ సమస్యలకు కారణం సినిమా కంప్లీట్ అవ్వకపోవడమో లేక ఫైనాన్షియల్ ట్రబుల్సో కాదు. సినిమాకి ఆర్.ఆర్ పూర్తికాకపోవడమే. అయితే.. ఆఖరి నిమిషంలో సీన్ లోకి ఎంటరయ్యాడు తమన్ బాబు,

సొ, “మజిలీ” మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ కారణాంతరాల వలన తప్పుకోవడంతో సినిమాకి ఆర్.ఆర్ చేసేందుకు తమన్ పూనుకున్నాడు. ఆల్రెడీ వర్క్ మొదలైందని.. త్వరలోనే ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడని సమాచారం. మరి తమన్ యాడ్ అవ్వడం “మజిలీ” సినిమా అవుట్ పుట్ కి ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus