వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘సరస్వతి’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ మొన్నమొన్ననే జరిగింది. అప్పుడు విడుదలకు సిద్ధమైపోయింది. దీంతో ఇంత త్వరగానే అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇదే సమయంలో మరో సినిమా గురించి కూడా మీకు చెప్పాలి. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ దర్శకుడిగా మారుతూ కొన్ని నెలల క్రితం ఓ సినిమా ప్రారంభించారు తెలుసా? పెద్దగా ప్రచారం చేయలేదు కానీ ఓ సినిమా అయితే స్టార్ట్ చేశారు. ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఆయన స్టార్ట్ చేసిన సినిమా ‘సరస్వతి’ నే.
ఇప్పుడు అర్థమైందా ఈ రెండు సినిమాల మధ్య లాజిక్. రైటర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే సాయి మాధవ్ ఈ సినిమాను స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. దీని కోసం పెద్ద హీరోల సినిమాలకు పని చేసే అవకాశాన్ని కూడా వద్దనుకున్నారు. ఓకే చేసి, కొన్ని రోజులు పని చేసిన సినిమా నుండి బయటకు వచ్చేశారు కూడా. అయితే ఏమైందో ఏమో ‘సరస్వతి’ నుండి తప్పుకున్నారు. దీంతో వరలక్ష్మీనే ముందుకొచ్చి ఆ సినిమాను డైరెక్ట్ చేసి పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రచారం స్టార్ట్ చేయగా.. బుర్రా సాయి మాధవ్ విషయం బయటకు వచ్చింది.
బుర్రా సాయిమాధవ్ కొన్ని కారణాల వల్ల సినిమా నుండి బయటకు వెళ్లిపోతూ కథను టీమ్‌కి ఇచ్చేశారట. ఈ విషయాన్ని టీమ్ ఇటీవల ప్రెస్ మీట్‌లో ఎక్కడా ఏమీ చెప్పలేదు. అసలు ఆయన పేరే ప్రస్తావనకు రాలేదు. అయితే పోస్టర్ పేరు వేశారు. అయితే ఇప్పుడు ఆయన సన్నిహితులు చెబుతున్న విషయం అంటేంటే.. సినిమా కథ ఇచ్చినందుకు డబ్బులు అడుగుతుంటే టీమ్ నుండి ఎవరూ స్పందించడం లేదట. టీమ్ ఎందుకు కామ్‌గా ఉంది అనేది తెలియాల్సి ఉంది. చూద్దాం సినిమా ప్రచారం కోసం మరోసారి మీడియా ముందుకు టీమ్ వచ్చినప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.