ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సారి కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఈ వేడుకలో ఇటు పురస్కారాలు, అటు హీరోయిన్ల జిగేల్‌మనే హీరోయిన్లతో అదిరిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ 70వ ఫిల్మ్‌ఫేర్ వేడుకల్లో 2024లో దక్షిణాది సినిమా పరిశ్రమల్లో విడుదలైన సినిమాలకు అవార్డులు ఇచ్చారు. తెలుగు సినిమాల్లో వేటికి, ఎవరికి అవార్డులు వచ్చాయో చూద్దాం.
ఉత్తమ చిత్రం – ‘పుష్ప: ది రూల్’
ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప: ది రూల్)
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప : ది రూల్)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ చిత్రం (క్రిటక్స్) – లక్కీ భాస్కర్
ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జ (హను – మాన్)
బెస్ట్ డెబ్యూ – ఫిమేల్ – నయన్ సారిక (గం గం గణేశ)
బెస్ట్ డెబ్యూ మేల్ – సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్): శ్రీ కృష్ణ (కుర్చీ మడతపెట్టి- ‘గుంటూరు కారం’)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): శిల్పా రావ్ (చుట్టమల్లె – ‘దేవర 1’)
బెస్ట్ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె – ‘దేవర 1’)
బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ ( కుర్చీ మడతపెట్టి – ‘గుంటూరు కారం’)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ – మోనికా (పుష్ప 2: ది రూల్) & నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 AD)