Sai Pallavi: గ్రాండ్ పేరెంట్స్ తో సాయి పల్లవి ట్రెడిషినల్ లుక్!

  • August 3, 2021 / 02:12 PM IST

మళయాళం బ్యూటీ సాయి పల్లవి కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా కథలో తన పాత్ర చాలా కీలకం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక మొన్నటివరకు షూటింగ్స్ తో బిజీగా ఉన్న సాయి పల్లవి సడన్ గా ఫ్యామిలీ సభ్యులను కలిసి వారితో పూజల్లో పాల్గొంటోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని స్పెషల్ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.

సొంత బాషా మళయాళం అయినప్పటికి ఫిదా సినిమా అనంతరం అమ్మడు లోకల్ తెలుగమ్మాయి అనేలా ఒక ముద్ర వేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరక్కెక్కిన ఆ సినిమా అనంతరం వెంటనే మళ్ళీ లవ్ స్టొరీ సినిమాతో సిద్ధమయ్యారు. ఇక చాలా కాలం అనంతరం అమ్మమ్మ, తాతలతో కలిసి ట్రెడిషినల్ గా కనిపించింది. సాయి పల్లవి సోదరి కూడా అందులో ఉంది. ఇద్దరు ప్రత్యేకంగా హగ్ చేసుకొని అందరిని ఆకట్టుకున్నారు.

ఇక చివరగా పడి పడి లేచే మనసుతో డిజాస్టర్ అందుకున్న సాయి పల్లవి ఈసారి మాత్రం ఎలాగైనా స్ట్రాంగ్ గా హాట్ అందుకోవాలనే కసితో ఉంది. సాయి పల్లవి లైనప్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. నెక్స్ట్ లవ్ స్టొరీ సినిమాతో పాటు విరాట పర్వం,శ్యామ్ సింగరాయ్ సినిమాలు కూడా విడుదలకు సిద్దమవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి .

1

2

3

4

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus