తెలుగులో రీమేక్ కానున్న మరాఠీ సూపర్ హిట్ సినిమా..!

  • May 20, 2016 / 02:17 PM IST

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి హిట్ చిత్రాల రీమేక్ లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు మరాఠీ చిత్రం ‘సైరత్’ రీమేక్ కు కూడా అదే స్థాయి లో డిమాండ్ ఏర్పడింది. నాగ్ రాజ్ మంజులే దర్శకత్వంలో ఆకాష్ తోషర్, రింకురాజ్ లు జంటగా నటించిన ఈ చిత్రం అతి తక్కువ థియేటర్లలో విడుదల అయ్యింది.

తక్కువ థియేటర్ లలో అయినప్పటికీ ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళీ, కన్నడ, బెంగాలీ భాషల్లోకి రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినవచ్చాయి. ఈ వార్తలను కొట్టిపడేసిన నాగ్ రాజ్.. ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి తెలుగు, గుజరాతీ భాషల్లోకి రీమేక్ చేయడానికి చూస్తున్నట్లు స్పష్టం చేశాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus