ఈ మధ్య కాలంలో వరుసపెట్టి హీరోయిన్లు మాల్దీవుల్లో సందడి చేయడాన్ని మనం చూస్తూ వచ్చాము. కేవలం టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు కూడా అక్కడ మెరుస్తుండడంతో.. అది టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ ఇంట్లోనే ఉంటూ వచ్చిన హీరోయిన్లు ఇప్పుడు వరుస పెట్టి హాలిడే ట్రిప్స్ వేస్తుండడాన్ని మనం గమనించవచ్చు. అందుకు సంబందించిన ఫోటోల్లను కూడా వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అభిమానులను ఖుషీ చేయిస్తున్నారు.
అయితే ఓ బ్యూటీ కొంచెం డిఫరెంట్ గా గోవాలో సందడి చేసి.. తన గ్లామర్ పిక్స్ తో సోషల్ మీడియాకు హీట్ పుట్టిస్తుంది. ఆమె మరెవరో కాదు సాక్షి అగర్వాల్. ఈమె ఎవరు అనుకుంటున్నారా? ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’ వంటి బడా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే ఉంది. అంతేకాదు ఈమె ఒక మోడల్ కూడా..!,
తాజాగా ఈ బ్యూటీ యెల్లో కమ్ ఫ్లోరల్ బీచ్ వేర్ లో గోవా బీచ్ లో గ్లామర్ వలకబోసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.’వావ్ సూపర్’ ‘ఎంతసక్కగున్నావే’ అంటూ నెటిజన్లు కామెంట్లతో దుమ్ము లేపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈమె గ్లామర్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :